BigTV English

SSMB 29 : హీరోని పట్టించుకోని జక్కన్న, అలా చేయడం వెనక ఆంతర్యం ఏమిటి.?

SSMB 29 : హీరోని పట్టించుకోని జక్కన్న, అలా చేయడం వెనక ఆంతర్యం ఏమిటి.?

SSMB 29 : రాజమౌళి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి టాలెంట్ ఏంటో ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. కేవలం తన స్థాయిని పెంచుకోవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసాడు జక్కన్న. బాహుబలి సినిమా తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మిగతా ఇండస్ట్రీలు చూసే పద్ధతి మారిపోయింది.


బాహుబలి అనే విజిటింగ్ కార్డ్ అప్పుడు చాలా పాన్ ఇండియాలకు అద్భుతంగా వర్కౌట్ అయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనగానే బాహుబలి పేరు టక్కున వినిపించేది. ఈ క్రెడిట్ అంతా కూడా ఎస్ఎస్ రాజమౌళికి దక్కాల్సిందే. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి సాయి ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB29) సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

హీరోని పక్కన పెట్టేసాడు 


మామూలుగా ఒక సినిమాకు సంబంధించి ఒక హీరో అనుకున్న తర్వాత హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అని అనేక చర్చలు జరుపుతారు. అన్ని జరిగిన తర్వాత ఒక హీరోయిన్ ను ఆ సినిమా కోసం ఫిక్స్ చేస్తారు. అయితే ఇప్పటివరకు SSMB29 లో హీరోయిన్ ఎవరు అనేది బయటకు రాలేదు. ప్రియాంక చోప్రా పేరు కొన్నిరోజులు వినిపించింది. అందరూ కూడా ప్రియాంక చోప్రా హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రియాంక చోప్రా ఇప్పుడు హీరోయిన్ కాదు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తనకు జంటగా ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే విలన్ పాత్రకు హీరోయిన్ సెట్ చేసాడు కానీ ఇంకా హీరో పాత్రకు సెట్ చేయలేదు. హీరోను పక్కన పెట్టేసాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తారస్థాయి అంచనాలు 

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మితమవుతున్న భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమా మరో ఎత్తు. మహేష్ బాబు మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కొన్నిసార్లు బాలీవుడ్లో సినిమా చేస్తారా అని అడిగినప్పుడు ముందు తెలుగులో చేయాల్సినవి చాలా ఉన్నాయి అంటూ మహేష్ బాబు చెప్పాడు. కానీ ఇప్పుడు కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీ అన్నిటికీ కూడా ఈ సినిమాతో పరిచయం కానున్నాడు మహేష్. కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమైన మహేష్ టాలెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలియబోతుంది. ఇక మహేష్ బాబు కూడా పాన్ ఇండియా లిస్టులోకి చేరిపోయినట్లే.

 

Also Read: Akhanda 2 : బాలయ్య అభిమానులకు బాడ్ న్యూస్, అసలు ఏం జరుగుతుంది.?

Related News

Ghaati: ఘాటీ సినిమాపై ఈగల్ టీమ్ అభ్యంతరం

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Big Stories

×