BigTV English

Samantha: నా విడాకులు వారికి సంబరాలు.. సమంత షాకింగ్ కామెంట్స్!

Samantha: నా విడాకులు వారికి సంబరాలు.. సమంత షాకింగ్ కామెంట్స్!
Advertisement

Samantha:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న సమంత (Samantha ) తెలుగు, తమిళ్ భాషలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ఇక అంతా సవ్యంగా సాగుతోంది అనుకునేలోపే అనూహ్యంగా 4 ఏళ్లకే విడాకులు తీసుకొని విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన ఈమె.. ఈ సమస్య నుంచి బయటపడడానికి సుమారుగా కొంత కాలమే పట్టింది. అటు విదేశాలకు వెళ్లి అక్కడ చికిత్స తీసుకొని ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా విరామం ప్రకటించింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇండస్ట్రీలో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను స్థాపించి ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. అంతేకాదు ఇందులో ‘మాయా’ పాత్రలో నటించి ఆకట్టుకుంది. నటిగా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. నిర్మాతగా కూడా మొదటి చిత్రంతో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.


నా విడాకులు వారికి సంబరాలు..

ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలో భాగంగా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తూనే మరొకవైపు ‘రక్త బ్రహ్మాండ్ :ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అంతేకాదు అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యే ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన విడాకులు వారికి సంబరాలు అంటూ ఊహించని కామెంట్లు చేసింది. మరి ఎవరిని ఉద్దేశించి సమంత ఆ కామెంట్లు చేసిందో ఇప్పుడు చూద్దాం..

ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు?

సమంత మాట్లాడుతూ.. “నా సినీ కెరియర్లోనే కాదు వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నన్ను ద్వేషించే వాళ్ళు నా దుస్థితిని చూసి నవ్వుకున్నారు. ముఖ్యంగా నేను విడాకులు తీసుకున్నప్పుడు వారు సంబరాలు చేసుకున్నారు. పైగా నా జీవితం పై వ్యాఖ్యానిస్తూ.. నా భవిష్యత్తు గురించి వారే నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా మాట్లాడడం నన్ను మరింత బాధకు గురిచేసింది. అయితే ఆ తర్వాత నుంచి నేను ఎవరిని పట్టించుకోలేదు. నా పని ఏదో నేను చూసుకోవడం మొదలు పెట్టాను.. ముఖ్యంగా ఇప్పుడు నన్ను నేను ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాను” అంటూ సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే సమంత ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసిందో అర్థం కావడం లేదు.


ALSO READ:HBD Prabhas: 46 ఏళ్లు.. ఇప్పటికైనా శుభవార్త చెప్పవయ్యా!

సమంతకు మద్దతుగా అభిమానులు..

ఇకపోతే ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సమంత చాలా ధైర్యం కలిగిన మహిళ.. బలమైన మనసుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది సమంత నిజమైన ఫైటర్.. ఆమెను తొక్కేయాలని చూసిన వాళ్ళందరికీ ఇదే ఆమె సమాధానం అంటూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇకపోతే మరొకవైపు సమంతపై ఎఫైర్ రూమర్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వాటి గురించి యాంటీ ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా వాటన్నింటికీ సమంతా చెక్ పెట్టాలని కోరుతూ ఉండడం గమనార్హం.

Related News

Upasana Konidela: అఫీషియల్… రెండో వారసుడు రాబోతున్నట్లు ప్రకటించిన మెగా కోడలు

SKN: బండ్లన్న అలా చేస్తే ఇండస్ట్రీకి ప్రమాదం… నిర్మాత SKN షాకింగ్ కామెంట్!

Fauzi: పుట్టుకతో అతను ఒక యోధుడు.. అదిరిపోయిన ఫౌజీ లుక్

Bandla Ganesh: జోష్ మూవీ కోసం సిద్ధూ ఆరాటం.. కట్ చేస్తే నెక్స్ట్ రవితేజ!

HBD Prabhas: 46 ఏళ్లు.. ఇప్పటికైనా శుభవార్త చెప్పవయ్యా!

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రెబల్ స్టార్ టు పాన్ ఇండియా స్టార్..ఆస్తుల విలువ ఎంత..?

Telusukada: తెలుసు కదా సినిమా ఫస్ట్  ఛాయిస్ సిద్దు కాదా..చేతులారా హిట్ సినిమా వదులుకున్న హీరో?

Big Stories

×