చాలా మంది ఔత్సాహికులు ఎత్తైన పర్వతాలను ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. అయితే, కొంత మంది మాత్రమే సక్సెస్ ఫుల్ గా శిఖరాగ్రాలకు చేరుకుంటారు. చాలా మంది మధ్య నుంచే వెనక్కి వస్తారు. పర్వతాలను ఎక్కడం అంత ఆశామాషీ వ్యవహారం కాదు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకుసాగాల్సి ఉంటుంది. మార్గం మధ్యలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఇక తాజాగా ఓ జంట పోలాండ్ లోని ఎత్తైన పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించి తీవ్ర విమర్శలపాలైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
పర్వతాలు ఎక్కే సమయంలో కొన్ని కచ్చితంగా పాటించాల్సిన భద్రతా చర్యలు ఉంటాయి. తాజాగా ఆ రూల్స్ ను బ్రేక్ చేస్తూ లిథువేనియన్ జంట పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేసింది. ప్రమాదకరమైన శీతాకాల పరిస్థితుల్లో వారి 9 నెలల పాపతో పోలాండ్‌లోని ఎత్తైన శిఖరం మౌంట్ రైసీని అధిరోహించడానికి ప్రయత్నించారు. అయితే, పూర్తిగా ఎక్కలేక మధ్యలోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దట్టమైన మంచుతో కూడిన పరిస్థితులలో చిక్కుకుపోయారు. పైకి ఎక్కలేక, కిందికి దిగలేక, అవస్థలు పడ్డారు. ఈ సమయంలో ఓ మౌంటెన్ గైడ్ పాపతో పాటు ఆ జంటకు కాపాడాడు. తమ పాపను సురక్షితంగా తీసుకువెళ్లే ముందు ఆమె తండ్రి గైడ్ నుంచి క్రాంపాన్లను కూడా తీసుకోవడానికి ప్రయత్నించాడు.
రైసీ పర్వతంపై పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ స్థానిక గైడ్లు, రక్షణ సిబ్బంది హెచ్చరికలు చేసినప్పటికీ, ఆ జంట పట్టించుకోలేదన్నారు. మంచు, మంచుతో కప్పబడిన ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రత్యేకమైన పరికరాలు, అనుభవం అవసరమన్నారు. పాప తల్లిదండ్రులకు ఈ రెండూ లేకపోయినా ఎక్కేందుకు ప్రయత్నించి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
పాపతో కలిసి పర్వతాలు ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమైన జంట వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది తల్లిదండ్రుల వ్యవహారం బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా ఉందంట నిప్పులు చెరిగారు. “కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతను పణంగా పెట్టి ఇంత ప్రమాదకర నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో అర్థం కావట్లేదు. శిశువుకు ఇబ్బంది కలిగించకుండా ప్రకృతిని ఆస్వాదించడానికి లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి. ఈ మార్గం ఎంచుకోవాల్సిన అవసరం లేదు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “వారు తెలిసీ శిశువు ప్రాణానికి ముప్పు కలిగించే ప్రయత్నం చేసినట్లు అర్థం అవుతుంది. పోలీసులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “ పర్వతాన్ని ఎక్కేందుకు అవసరమైన సామగ్రి లేకుండా తొమ్మిది నెలల పాపతో కలిసి పర్వతం ఎక్కడం నిజంగా నిర్లక్ష్యమే. గైడ్ శిశువును రక్షించడం నిజంగా ఆమె అదృష్టం” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ఈ ఘటనలో పాపతో పాటు ఆ జంటను గైడ్ సురక్షితంగా కిందికి దించాడు. కానీ, తల్లిదండ్రుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
“No words.” A couple climbed Poland’s highest mountain with a baby — and sparked outrage
A Lithuanian couple attempted to ascend Mount Rysy while carrying their nine-month-old child, Delfi reports.
Conditions were extremely dangerous. Guides and rescuers warned them repeatedly,… pic.twitter.com/jgN8l6mPEg
— NEXTA (@nexta_tv) October 21, 2025
Read Also: