Akhanda 2 : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ టైం మంచిగా నడుస్తుంది అని చెప్పాలి. వరుసుగా హిట్ సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు బాలయ్య. ఒక తరుణంలో బాలయ్య సినిమాలంటే కనీసం ఆసక్తి కూడా ఉండేది కాదు. వరుసగా డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. అయితే ఆహా నిర్వహించిన అన్ స్టాపబుల్ అనే షో బాలయ్య కెరియర్ ని అన్ స్టాపబుల్ చేసేసింది. తిరిగి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా రాలేదు.
బాలకృష్ణ ఎంత మంది దర్శకులతో వర్క్ చేసినా కూడా బోయపాటి శ్రీను కాంబినేషన్లో బాలయ్య బాబు సినిమా అంటేనే అంచనాలు ఈజీగా పెరిగిపోతాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ 2. ఈ సినిమా నుంచి వచ్చిన వీడియో ఇదివరకే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంచనాలను రెట్టింపు చేసింది.
అభిమానులకు బ్యాడ్ న్యూస్
ఈ సినిమాని సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తికాలేదు. చిత్ర యూనిట్ కోరుకున్నట్లుగా విఎఫ్ఎక్స్ వర్క్ జరగాలి అంటే కనీసం రెండు నెలల టైం పడుతుంది. అందుకే ఈ సినిమాను డిసెంబర్ నెలలకు పోస్ట్ పోన్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇది బాలకృష్ణ అభిమానులకు కొంచెం నిరాశ కలిగించే విషయం అని చెప్పాలి. ఇప్పటికే డిసెంబర్ లో రాజా సాబ్ సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఒకవేళ అఖండ 2 సినిమాను డిసెంబర్ కు వాయిదా వేస్తే ప్రభాస్ సినిమాతో పోటీకి దిగాల్సిందే. సినిమాకి మంచి డేట్ దొరికింది అనుకునే టైంలో ఇలా అఖండ 2 రావడం కూడా ప్రభాస్ సినిమాకి కొద్దిపాటి మైనస్.
మరోసారి బోయపాటి సంభవం
బోయపాటి శ్రీను అంటేనే యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఇప్పటివరకు బోయపాటి చేసిన ప్రతి సినిమా యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుంది. అందుకే బోయపాటి శ్రీను సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధిస్తాయి. ఒక బాలకృష్ణ తో సినిమా అంటే ఆ యాక్షన్ సీన్స్ మరింత రేంజ్ కి వెళ్ళిపోతాయి. ఇప్పటికే రిలీజ్ అయిన వీడియోలో త్రిశూలం సీన్ బాగా పాపులర్ అయింది. అసలు ఆ ఆలోచన బోయపాటి శ్రీనుకు ఎలా వచ్చింది అని చాలామంది చర్చించుకున్నారు. చిన్న టీజర్ లోని యాక్షన్ సీక్వెన్స్ గురించే చాలా రోజులు మాట్లాడుకున్నారు. ఇక కంప్లీట్ సినిమా వస్తే ఎలా ఉండబోతుందో అని చాలామందికి క్యూరియాసిటీ మొదలైంది.
Also Read: Anushka Shetty : బాహుబలిని పక్కన పెట్టేసిన అనుష్క, ఘాటీ పరిస్థితి ఏంటి.?