Sunflower Seeds: మన ఆరోగ్యానికి ప్రకృతి ఇచ్చిన వరాలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఒకటి సన్‌ఫ్లవర్ గింజలు. వీటిని మనం చాలా సార్లు తోటల్లో పూలుగా మాత్రమే చూసి మర్చిపోతాం కానీ, వాటి గింజల్లో దాగి ఉన్న ఔషధ గుణాలు నిజంగా అద్భుతమైనవి. ప్రతిరోజూ కొద్దిపాటి సన్‌ఫ్లవర్ గింజలు తినడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇవి మన రక్తం నుంచి గుండె వరకు, చర్మం నుంచి ఎముకల వరకు సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడతాయి.
రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది
సన్‌ఫ్లవర్ గింజల్లో పోలీ అన్‌స్యాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్, మోనో అన్‌స్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతాయి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. కొద్దికాలం నిరంతరంగా ఈ గింజలు తింటే రక్తం సులభంగా ప్రవహిస్తుంది, రక్తనాళాల్లో ముడతలు పడకుండా చేస్తాయి.
గుండెజబ్బులకు చెక్ పడుతుంది
సన్‌ఫ్లవర్ గింజల్లో విటమిన్ ఈ, మాగ్నీషియం, సెలీనియం వంటివి గుండె ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఈ గింజలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి, హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయి. పరిశోధనల ప్రకారం రోజుకు రెండు టీస్పూన్లు సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 20శాతం వరకు తగ్గుతుందని తేలింది.
మలబద్ధకం తగ్గుతుంది
మలబద్ధకం బాధపడేవారికి ఇది దేవుడిచ్చిన వరం లాంటిది. ఎందుకంటే సన్‌ఫ్లవర్ గింజల్లో ఫైబర్ (Fiber) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలాన్ని సాఫీగా బయటకు పంపుతుంది. ప్రతి రోజు తినడం వల్ల కడుపు బాగుంటుంది, గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటి(bloating, acidity) వంటి సమస్యలు తగ్గిపోతాయి.
క్యాన్సర్ ను అడ్డుకునే శక్తి
సన్‌ఫ్లవర్ గింజల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ ముఖ్యంగా విటమిన్ ఈ, సెలీనియం శరీరంలోని కణాలను రక్షిస్తాయి. ఇవి క్యాన్సర్ కారకమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్థం చేస్తాయి. శాస్త్రవేత్తల ప్రకారం, నిరంతరంగా సన్‌ఫ్లవర్ గింజలు తింటే, ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
Also Read: Samsung Galaxy M06 5G: సామ్‌సంగ్ గెలాక్సీ ఎం06 5జి క్రెజీ ఎంట్రీ.. బడ్జెట్‌లో అద్భుతమైన 5జి ఫీచర్లు
ఎముకల దృఢత్వానికి మేలు
వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనత వస్తుంది. సన్‌ఫ్లవర్ గింజల్లో ఉన్న మాగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ ఎముకల నిర్మాణాన్ని బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా మహిళలకు, వృద్ధులకు ఈ గింజలు అత్యంత అవసరం. ఇవి ఆస్టియోపొరోసిస్ (Osteoporosis) లాంటి సమస్యల నివారణలో సహాయపడతాయి.
చర్మం, జుట్టు సంరక్షణకు అద్భుతం
సన్‌ఫ్లవర్ గింజల్లో విటమిన్ -ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి కాంతినిస్తుంది, ముడతలు తగ్గిస్తుంది. జుట్టుకు అవసరమైన ప్రోటీన్లు, జింక్, విటమిన్లు ఇవన్నీ ఈ గింజల్లో లభిస్తాయి. రెగ్యులర్‌గా తింటే జుట్టు రాలడం తగ్గుతుంది, చర్మం మెత్తబడుతుంది.
బీపీ కంట్రోల్లో ఉంటుంది
ఇందులోని మాగ్నీషియం రక్తపోటు స్థాయిని నియంత్రిస్తుంది. అధిక బీపీతో బాధపడే వారికి సన్‌ఫ్లవర్ గింజలు సహజమైన మందులా పనిచేస్తాయి. రోజుకు కొద్దిపాటి గింజలు తినడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి తగ్గుతుంది, బీపీ స్థిరంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఈ గింజల్లో ఉన్న విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి. దీంతో జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు దగ్గరగా రావు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది.
ఎలా తినాలి? – జాగ్రత్తలు
రోజుకు ఒక చెంచా సన్‌ఫ్లవర్ గింజలు చాలు. ఉదయం అల్పాహారంలో లేదా సాయంత్రం స్నాక్ గా తినవచ్చు. వీటిని పచ్చిగా లేదా వేయించి తినడం మంచిది. నీటితో మరిగించి తాగడం కూడా ఒక ఆరోగ్యవంతమైన మార్గం. అయితే పరిమితికి మించి తింటే కాలరీలు ఎక్కువవుతాయి, బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు 20–30 గ్రాములు మించకూడదు. ప్రతి రోజు కొద్దిగా తీసుకుంటే శరీరం తేలికగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది.