Priyanka Chopra: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా గ్లోబల్ బ్యూటీగా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తిరిగి ఇండియన్ సినిమాలలో భాగమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వారణాసి(Varanasi) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రియాంక చోప్రా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన భర్తనిక్ తో కలిసి పాల్గొన్న ఈమె తన కుమార్తె మాల్తీ మేరీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ప్రియాంక చోప్రా వయసులో తనకంటే చిన్న వ్యక్తి అయిన హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ (Nick jonas)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరి వివాహం తర్వాత ప్రియాంక చోప్రా లాస్ ఏంజెల్స్ లో స్థిరపడ్డారు. ఇక వివాహం తర్వాత ఈమె బాలీవుడ్ సినిమాలకు కూడా దూరమై హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు మాల్తీ మేరీ(Malti Marie) అనే కుమార్తె జన్మించారు. అయితే ఈ చిన్నారి సరోగసి ద్వారా జన్మించిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారి గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ నిజానికి మాల్తీ ఏప్రిల్ నెలలో పుట్టాల్సి ఉండగా మూడు నెలలు ముందుగానే జన్మించిందని. తమ కుమార్తె పుట్టిన సమయంలో 765 గ్రాముల బరువు మాత్రమే ఉందని తెలిపారు.
తన కుమార్తె ప్రీ మెచ్యూర్ బేబీ కావడంతో కొన్ని నెలలపాటు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అయితే అదే సమయంలో కరోనా కూడా కావడంతో తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలియజేశారు. చావు బతుకల మధ్య తన కుమార్తె హాస్పిటల్ లో పోరాటం చేస్తుంటే చాలా భయంగా బ్రతికామని తాను ప్రియాంక షిప్టులవారీగా ప్రతిరోజు 12 గంటల పాటు హాస్పిటల్లో ఉండే వాళ్ళం. అలా మూడు నెలలకు పైగా తమ కుమార్తె ఐసీయూలోనే చికిత్స తీసుకుందని తెలిపారు.
ఆరుసార్లు రక్తమార్పిడి..
ఈ మూడు నెలల కాలంలో తన కుమార్తెకు ఆరుసార్లు రక్తమార్పిడి చేసి చికిత్స అందించేవారు ఇలాంటి కష్ట సమయంలో తమ కుమార్తె ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవాలని ప్రార్థించాము. మేము కోరుకున్న విధంగానే మా కుమార్తె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని క్షేమంగా ఇంటికి వచ్చిందంటూ తన కుమార్తె పడిన ఇబ్బందుల గురించి ప్రియాంక నిక్ దంపతులు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇక ప్రస్తుతం చిన్నారి మాల్తీ ఎంతో ఆరోగ్యంగా ఉన్న సంగతి తెలిసిందే తరుచూ ప్రియాంక నిక్ దంపతులు తమ కుమార్తెతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.
Also Read: Kiran Abbavaram: ఆ సీక్వెల్ నుంచి కిరణ్ అబ్బవరం ఔట్..షాక్ ఇచ్చిన నిర్మాత!