ADE Ambedkar: విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏడీఈ బినామీ ఇంట్లో అధికారులు భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.2 కోట్ల 10 లక్షల నగదు ఏసీబీ స్వాధీనం చేసుకుంది. పట్టుబడ్డ బంగారం విలువను ప్రస్తుతం అధికారులు లెక్కిస్తున్నారు.
గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, ప్లాట్లు, సూర్యాపేటలో 10 ఎకరాల వ్యవసాయ భూమి, కొండాపూర్ 3 బీహెచ్‌కే ఫ్లాట్ ను అధికారులు గుర్తించారు. మెదక్, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇప్పటి వరకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ ఇంట్లో సోదాల వివరాలను రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. గతంలో అధికారి అంబేద్కర్ మీద వచ్చిన ఆరోపణ నేపథ్యంలోనే ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. అధికారులతో కుమ్మక్కై భారీగా అక్రమ సంపాదనను సంపాదించారని అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు సూర్యాపేటలో 10 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, నర్కుడ లోని 1000 యాడ్స్ ఉన్న స్థలం, గచ్చి బౌలి కొండాపూర్ లో భారీ విలువైన ఆస్తులను గుర్తించామని తెలిపారు. ఇంకా బినామీల పేరు పైన కూడా భారీగా ఆస్తులున్నాయని.. వాళ్ళు ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉందని వివరించారు. ఇప్పటి వరకుఅన్ని డాక్యుమెంట్స్ ను పరిశీలించామని చెప్పారు. గతంలో పట్టుబడిన అవినీతి అధికారులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా..? అని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఇంకా పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ALSO READ: Andhra Pradesh: దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15 వేల సహాయం – వాహన మిత్ర పథకం ప్రారంభం