Priyanka Jain: ఏంటీ.. ప్రియాంక జైన్ కి శివ్ బ్రేకప్ చెప్పేసాడా.. ? ప్రియాంకను వదిలేసి శోభా శెట్టితో కమిట్ అయిపోయాడా..? ఇంతకీ ప్రియాంక జైన్ ని పక్కన పెట్టి శోభాశెట్టితో శివ్ ఎందుకు కలిసిపోయాడు..? ఆమెతో ఎందుకు పులిహోర కలుపుతున్నాడు..? వీరిద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారా..? మరి శివ్ – శోభ శెట్టి కలిసిపోతే శోభా శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్న యశ్వంత్ ఎక్కడికి పోతాడు? అంటూ ఈ విషయం వినిపించగానే చాలామంది మైండ్ లో ఇలా కొన్ని ప్రశ్నలు మెదులుతాయి. మరి ఇంతకీ ప్రియాంక జైన్ ని వదిలేసి శివ్ శోభాశెట్టితో కలిసిపోయాడు అనే రూమర్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రియాంక జైన్ ప్రియుడు శివ్.. శోభా శెట్టితో పులిహోర కలిపిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రియాంక జైన్ తో సహజీవనం చేస్తూనే.. నేను సింగిల్ అంటూ ఆయన శోభా శెట్టితో ఆ వీడియోలో మాట్లాడారు. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..” శివ్ ఒక్కడే కారులో వెళ్తున్న సమయంలో శోభా శెట్టి లిఫ్ట్ అడుగుతూ నన్ను అక్కడ దింపుతారా? అని అడగడంతో శివ్ ఓకే లోపలికి రండి అని చెబుతాడు. ఇక కారు లోపలికి శోభా ఎక్కడంతోనే శివ్ జుట్టు సెట్ చేసుకుంటూ పోజ్ ఇస్తాడు..శోభా శెట్టి మీరు ఎక్కడ ఉంటారు అని అడగగా.. నేను ఈ దగ్గరలోనే ఉంటాను అని ఆన్సర్ ఇస్తాడు. ఆ తర్వాత శోభా శెట్టి మీరు సింగలేనా అని శివ్ ని అడగగా.. యా సింగిల్ అని ఆన్సర్ ఇవ్వడంతో వెంటనే శోభా శెట్టి తన ఫోన్ తీసుకొని ప్రియాంక జైన్ కి ఫోన్ చేస్తుంది.
ఉచ్చులో ఇరుక్కున్న శివ్..
ఎవరికి ఫోన్ చేస్తున్నారు అని అడిగినా కూడా ఆన్సర్ ఇవ్వకుండా ప్రియాంక కి ఫోన్ చేసి పరి మీ వాడు సింగిల్ అంటనే అని చెప్పడంతో నా పని గోవిందా అన్నట్లుగా శివ్ ఫేస్ పెడతాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రియాంక జైన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దానికి క్యాప్షన్ గా ఇది ఒక ఉచ్చు అంటూ పోస్ట్ పెట్టింది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ప్రియురాలిని పెట్టుకొని శోభాశెట్టితో పులిహోర కలుపుతున్న శివ్ కి మంచి పని అయింది అని కామెంట్లు పెడుతున్నారు..
ప్రియాంక – శివ్ పరిచయం, ప్రేమ..
మౌనరాగం సీరియల్ ద్వారా కలుసుకున్న శివ్ – ప్రియాంక జైన్ ఇద్దరు ఈ సీరియల్ షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడి ఆ తర్వాత లవ్ ని కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. నిజానికి ఇటీవల ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్ కి పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టింది. ఇక త్వరలోనే పెళ్లి అంటున్నారు కానీ ఇప్పటివరకు ఆ పెళ్లి డేట్ ప్రకటించకపోవడం గమనార్హం.
ALSO READ: Bigg Boss 9: మాస్క్ మ్యాన్‌కు రంగు పడింది.. ఏడ్చేసిన రీతూ చౌదరి, వాడివేడిగా నామినేషన్స్