SKN Tweet on Pawan Kalyan Dance: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ తన సినిమాలను లైన్ లో పెడుతున్నారు. హరి హర వీరమల్లు అయిపోయింది. ఇక నెక్ట్స్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ టైం వచ్చేసింది. ఇప్పటికే ఓజీ షూటింగ్ పూర్తి చేసిన ఆయన ఉస్తాద్ లో తన పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. తాజాగా క్లైమాక్స్ సీన్ పూర్తయినట్టు మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. అయితే తాజాగా ‘బేబీ‘ నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస్ కుమార్) ఓ ట్వీట్ వదిలాడు. పవన్ డ్యాన్స్ చూసి తన కళ్లల్లో నిళ్లు తిరిగాయంటూ ఎమోషనల్ అయ్యాడు.
పవన్ లైవ్ డ్యాన్స్.. కడుపు నిండింది..
‘కళ్ల నిండా లైవ్ లో ఆయన డ్యాన్స్ చూస్తే కడుపు నిండిన భావోద్వేగం.. లిరిక్ బయటకి వచ్చిన రోజున సోషల్ మీడియా మొత్తం తగలడిపోతుంది. ఆ రోజు మళ్లీ మాట్లాడుకుందాం‘ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ మూవీ హైప్ క్రియేట్ చేస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్, హరిష్ శంకర్లది హిట్ కాంబో అనే విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. పవన్ నుంచి ఓ అభిమాని ఏం కోరుకుంటారో.. సరిగ్గా అలాంటి కంటెంట్ డెలివరి చేయగలడు హరీశ్ శంకర్. ఎందుకంటే పవన్ తో సినిమా అంటే డైరెక్టర్ గా కాకుండా.. అభిమానిగా చేస్తాడు. ఈ విషయాన్ని ఎన్నో సార్లు ఆయన బయట పెట్టాడు.
పవన్ బాడీలోనే గ్రేస్..
ఇటీవల ఉస్తాద్ షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతున్నప్పుడు అభిమానిగా ఈ సినిమా తీసి మీ ముందు పెడతానంటూ ట్వీట్ చేశాడు. పవన్ తో అభిమాని సినిమా చేస్తే ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ లో చూపించాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో మరోసారి బ్లాక్ బస్టర్ పక్కా అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. తాజాగా నిర్మాత ఎస్కేఎన్ ట్వీట్ చూస్తే ఇక పవన్ డ్యాన్స్ ఎలా ఉండబోతుందో అంచనాలు వేసుకుంటారు. నిజానికి పవన్ పెద్ద డ్యాన్సర్ కాదనే విషయం తెలిసిందే. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిలా స్టెప్పులు వేయలేడు. కానీ, ఆయన జస్ట్ బాడీ కదిపితే చాలు అభిమానుల్లో ఉత్సాహం వచ్చేస్తోంది. ఆయన స్టైల్, బాడీలో క్రేస్ ఉంటుంది.
SKN ట్వీట్ పై ట్రోల్స్..
అలాంటి బాడీ ఆయన జస్ట్ కాలు చేయి.. కదిపిన ఆ స్టెప్ ట్రెండింగ్ లో నిలుస్తుంది. గబ్బర్ సింగ్ లో హరీశ్ శంకర్ అదే చేసి చూపించాడు. టైటిల్ సాంగ్ జస్ట్ ఒక సిగ్నేచర్ స్టేప్ తో థియేటర్లు తగలపడేలా చేశాడు. ఇప్పుడు ఉస్తాద్ లోనూ అలాంటి గ్రేస్ స్టేప్ ప్లాన్ చేసుంటాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఎస్కేఎన్ ట్వీట్ దీనికి మరింత బలం చేకూరింది. కానీ, ఈ ట్వీట్ కి యాంటి ఫ్యాన్స్ నుంచి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. ఆయన గ్రేస్, క్రేజ్ ఎలా ఉందో హరి హర వీరమల్లులో చూశామని, సీరియస్ యాక్షన్ సీన్ లో కామెడీ చేశాడంటున్నారు. వాటిపై ఎలాంటి ట్రోల్స్ వచ్చాయో తెలిసిందే. ఇక ఈ వయసులో పవన్ డ్యాన్స్ అంటే ట్రోల్స్ ఏ రేంజ్ వస్తాయో ఊహించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Nidhhi Agerwal: హరి హర వీరమల్లు సెట్ లో చిలుకతో ఆటలు.. చేయి కోరకడంతో విలవిల్లాడిన నిధి..
ఎక్కువ నింపుకోకు అన్నా..
వామిటింగ్స్ వస్తాయి జాగ్రత్త— Gajala From Washington DC (@GajalaFrmWDC) July 29, 2025