Intinti Ramayanam Today Episode September 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ పార్వతిని అన్ని అడుగుతాడు.. ఇంట్లో జరుగుతున్న వాటి గురించి పార్వతి రాజేంద్రప్రసాద్ తో చెబుతుంది. అవినీకి ఫోన్ చేసిన రాజేంద్రప్రసాద్ నేను ఇవాల్టికి అత్తయ్యతో పార్టీ అక్కడికి వెళ్తాను అమ్మని అంటాడు. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి మావయ్య గారు నేను వస్తాను అని అంటుంది అవని.. ఏ సమస్య లేదు నేను చూసుకుంటాను రేపు వస్తాను అని అంటాడు. ఇక రాజేంద్రప్రసాద్ పార్వతి తో కలిసి ఇంటికి వెళ్తాడు అక్కడ కమల్ అందరినీ తిడతాడు. ఇంతమంది ఉన్నారు అమ్మని ఒంటరిగా ఎందుకు హాస్పిటల్ కి పంపించారు అని అంటాడు. కానీ ఎవరు ఏం మాట్లాడుకున్నారంటే రాజేంద్రప్రసాద్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని అంటారు..మీరు వెళ్లిపోతే నాకు బాధగా ఉంది నేను కూడా మీతో పాటే వస్తాను అని అంటుంది. మీ నాన్నతో కలిసి నేను అక్కడే ఉండాలని అనుకుంటున్నాను అని అందరితో చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది.. అవని సంతోషంగా ఫీల్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి అవని దగ్గరికి వెళ్లిపోయిన తర్వాత ప్రణతితో ఓ ఆట ఆడుకుంటుంది శ్రీయ. ప్రణతి అన్ని వంటలు సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. భరత్ నువ్వు ఒక్కదానివి అన్ని పనులు చేసుకోకపోతే నన్ను కూడా సాయం అడగొచ్చు కదా అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రియ ఏం వంటలు చేశావు ఏం కూరలు చేశావు అని అడుగుతుంది. వెజ్ కూరలు చేశానని చెప్పగానే నాకు నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగడానికి నీకు తెలుసు కదా నువ్వెందుకు చేయలేదని ప్రణతి పై అరుస్తుంది. అక్కడకు వచ్చిన పల్లవి శ్రియాని చంప పగలగొడుతుంది.. నన్ను కొడతావ్ ఏంటి అని శ్రీయా అడుగుతుంది.
పార్వతి అవనికి సాయంగా ఉంటుందని వంటకి కూరగాయలను కట్ చేసి ఇస్తుంది. అయితే అవని మీరు ఇలా అలసిపోతే ఒళ్ళు పులుసు మళ్ళీ జ్వరం వస్తుంది మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అత్తయ్య అని అంటుంది.. కానీ పార్వతి మాత్రం నాకు ఏ పని చేయకుండా అంటే పొద్దు గడవదు అని అనుకుంటుంది. ఇక అక్షయ్ నేను ఆఫీస్ కి వెళ్ళొస్తానమ్మ అని అంటాడు. అవని అక్షయ కోసం లంచ్ బాక్స్ ను తీసుకొచ్చి ఇస్తుంది.. అది చూసి నాకు చెయ్ నువ్వు మీ అత్తయ్య గారిని తిప్పినట్టు నన్ను తిప్పాలని అనుకుంటున్నావేమో నేను అస్సలు మారను అని అంటాడు.
లంచ్ బాక్స్ తీసుకెళ్లారంటే అలా గుడ్లు అప్పగించి చూస్తావు ఏంట్రా అని భానుమతి అంటుంది.. వాళ్లందరూ మారినట్టు నేను మారను అని అక్షయ్ అంటాడు. ఎవరిలోనైనా మార్పు సహజమే నువ్వెందుకురా అవనిని దగ్గరకు తీసుకోలేకపోతున్నావు అని పార్వతి అంటుంది. నామీద కోపాన్ని భోజనం మీద చూపించకండి అని అవని భోజనం చెయ్యండి అండి బాక్స్ ఇస్తుంది. కానీ నువ్వు ఇచ్చే భోజనం తప్ప నాకు వేరే భోజనం దొరకదా నేను బయట తింటాను అని అక్షయ్ అంటాడు.
భరత్ ఇంటర్వ్యూ కి వెళ్లి రావడం చూసిన పల్లవి ఎక్కడికి వెళ్లావు భరత్ అని అడుగుతుంది. ఇంటర్వ్యూ కి వెళ్లాను సిస్టర్ అని భరత్ అంటాడు. అతని క్వాలిఫికేషన్ విన్న పల్లవి నువ్వు ఈ క్వాలిఫికేషన్ తో ఎలా జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నావ్ నేను నీకు బ్యాంక్ లోన్ వచ్చేలా చేస్తాను దాంతో నువ్వు 10 మందికి జాబ్ ఇచ్చేలా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చెయ్ అని సలహా ఇస్తుంది. కొత్తగా పెళ్లయింది కదా నువ్వు ప్రణతి అలా బయటకు వెళ్లి సరదాగా తిరిగి రండి కొత్త సినిమా రిలీజ్ అయింది అంట మీకోసం టికెట్లు బుక్ చేస్తాను అని పల్లవి అంటుంది.
పల్లవి మాటలు విన్న శ్రియా ఎందుకు అంతగా భరత్ ని వెనకేసుకుని వస్తున్నామని అడుగుతుంది. వాడిని నా గుప్పెట్లో పెట్టుకోవడం మంచిది కదా అని పల్లవి అంటుంది. శ్రీకరు ఏవో ఫైల్స్ చూసుకుంటూ ఉంటాడు. కమల్ అక్కడికి వచ్చి నీ భారీ మాట విని వదిన నేను అన్ని మాటలు అంటావా మన ఆస్తిని లాగేసుకున్న వారిని కనిపెట్టకుండా మౌనంగా ఉండిపోతావా అని అడుగుతాడు.. నీ పెళ్ళాం మాట విని నువ్వు ఇలా మారిపోతావ్ అని అస్సలు ఊహించలేదు అని కమల్ అంటాడు. ఆ మాట మాట విన్న శ్రియ కమలి నీకేమైనా పిచ్చా నా భర్తను ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నావు అని అడుగుతుంది..
Also Read : రోహిణిని స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రభావతికి చుక్కలు చూపించిన సుశీల.. మీనా హ్యాపీ..
నా భర్త గురించి మాట్లాడే అధికారం నీకు లేదు. నా భర్త మీద అన్ని హక్కులు నాకే ఉన్నాయి అంటూ శ్రీయా కమల్ తో వాదనకు దిగుతుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి నా భర్తకి పిచ్చి అంటావా అని ఇద్దరు భర్తల కోసం గొడవకి దిగుతారు. ఒక మాటలో చెప్పాలంటే జుట్లు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్తారు. వీరిద్దరిని ఆపడానికి ఇద్దరు చాలా ప్రయత్నాలు చేస్తారు. అక్షయ్ భోజనం తెచ్చుకోలేదని వాళ్ళ బాస్ అవనితో ఫోన్ మాట్లాడుతుంది.. మేమిద్దరం కలిసి భోజనానికి ఇంటికి వస్తున్నామని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..