Rahul Ravindran: సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కూడా వారు రిలీజ్ అయ్యాక ఉంటారా లేదా అనేది డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు సన్నివేశాలు లాగ్ అయ్యాయని, ఇంకొన్నిసార్లు ఆ సన్నివేశాలు సినిమాకు సెట్ అవ్వవు అని తెలిసినప్పుడు డైరెక్టర్ సీన్స్ ను కట్ చేస్తాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలా ఎడిటింగ్ లో చిన్న నటులే కాదు పెద్ద నటులు, మంచి మంచి సీన్స్ కూడా కట్ అవుతూ ఉంటాయి. కానీ, అలా ఎడిటింగ్ లో పోయిన చాలామంది నటీనటులు డైరెక్టర్లను తప్పు పడతారు.. కావాలనే తమ సీన్స్ కట్ చేశారని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటారు. కానీ, ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే అది డైరెక్టర్ ఛాయిస్ అంటూ వారికి గౌరవం ఇస్తారు.
తాజాగా నటుడు కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా ఓజీ సినిమాలో తన సీన్స్ తీసేసినా తప్పు పట్టకుండా అది డైరెక్టర్ ఛాయిస్ అంటూ చెప్పుకు రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఓజీ. ఈ సినిమా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ అందులో భాగంగా నిన్న ఓజీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఇక ఓజీ ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ పక్కన రాహుల్ రవీంద్రన్ కూడా కనిపించాడు. దీంతో ఆయన కూడా ఒక మంచి క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ ఫ్యాన్స్ చాలామంది ఆయనను గుర్తుపట్టి.. అందులో ఉన్నది మీరే కదా.. మీరు కూడా ఓజీలో ఉన్నారా.. ? అని సోషల్ మీడియా ద్వారా అడగగా.. రాహుల్, ఓజీలో నటించాను కానీ, ఎడిటింగ్ లో తీసేశారు అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
“హహా ఇలాంటి ట్వీట్లు చాలా వస్తున్నాయి. అవును అది నేనే. మొదట్లో చాలా ఆసక్తికరమైన పాత్ర చేశాను. కానీ, చాలా కట్ చేయాల్సి వచ్చింది. కానీ, జీతుని దగ్గరగా చూస్తూ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అతను తన విజువల్స్ ఎలా మలచాడో గమనించి నేర్చుకోవడం ఇంకా బావుంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు.
ఇక ఇంకో అభిమాని.. నీ పాత్రను కట్ చేయడం చాలా బాధగా ఉంది అని చెప్పగా.. దానికి రాహుల్ ” ఓహ్ ..దర్శకులు సినిమాను బాగా తీయడానికి ఏమైనా చేయాలి బ్రో. అదే అతి ముఖ్యమైన విషయం. ఇది మంచి విషయం. తరచుగా అలాంటి నిర్ణయాలలో చాలా అంశాలు ఉంటాయి. ఇది అర్ధం చేసుకోవాలి” అంటూ చెప్పుకొచ్చాడు. రాహుల్ కూడా ఒక డైరెక్టర్ కావడం, సుజీత్ అతని బెస్ట్ ఫ్రెండ్ కావడంతో అతనిపై ఒక్క మాట కూడా పడనివ్వకుండా రాహుల్ ఇలా స్పోర్టివ్ గా తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో సుజీత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Haha getting a lot of these tweets. Yes that’s me. I’ve done what was initially a very interesting role but had to chopped down quite a bit. But it was an absolute pleasure watching Jeethu at work from close quarters. Especially observing and learning from how he crafts his… https://t.co/OJsob0hWkV
— Rahul Ravindran (@23_rahulr) September 22, 2025