BigTV English
Advertisement

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ వివాదాస్పద మూవీ… 84 కోట్ల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ వివాదాస్పద మూవీ… 84 కోట్ల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘ పరం సుందరి’ సినిమాకి థియేటర్లలో కంటే ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఎవరైనా థియేటర్లలో చూడకపోతే, ఇప్పుడు ఓటీటీలోకి ఫ్యామిలితో కలసి సరదాగా చూసేయచ్చు. ఈ సినిమా రిలీజ్ కు ముందే కేరళ ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొంది. కేరళ సంప్రదాయాలను చూపించేటప్పుడు, కనీసం కేరళ అమ్మాయిని తీసుకోవచ్చనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ బాలీవుడ్ రొమాంటిక్ సినిమా వంద కోట్ల మార్క్ ని దాటలేక పోయింది. ఈ కథ పంజాబ్ కు చెందిన అబ్బాయి, దక్షిణాదికి చెందిన ఒక అమ్మాయి మధ్య జరిగే కెమిస్ట్రీ తో ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదాండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘పరం సుందరి’ (Param Sundari) సినిమా 2025 జూలై 25న థియేటర్లలో విడుదలైంది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమా, మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందింది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సంజయ్ కపూర్, భార్గవన్ నాయర్, అభిషేక్ బెనర్జీ, మంజోత్ సింగ్, ఇనాయత్ వర్మ మిగతా పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 24 నుంచి రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

పరం సచ్దేవ్ ఒక రిచ్ కిడ్. చాలా స్టార్టప్ బిజినెస్‌లు చేశాడు, కానీ ఏదీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు అతను తన ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో ఒక AI డేటింగ్ యాప్ ని డెవలప్ చేయాలనుకుంటాడు. ఈ యాప్ ద్వారా ఎవరైనా తన సోల్‌మేట్ ని తెలుసుకోవచ్చు. పరం ఈ యాప్‌ని తనపై టెస్ట్ చేస్తాడు. అది అతనికి కేరళలోఉన్న సుందరి పేరును చూపిస్తుంది. పరంకి ఈ యాప్ పనిచేసే తీరు నచ్చి, తన ఫాదర్‌ని ఈ యాప్‌ లో మనీ ఇన్వెస్ట్ చేయమని కన్విన్స్ చేస్తాడు. కానీ అతని ఫాదర్ ఒక కండిషన్ పెడతాడు. మొదట సుందరిని మీట్ అయి, రియల్‌గా సోల్‌మేట్ అని ప్రూవ్ చేయాలి. దీనిని ప్రూవ్ చేయడానికి పరం తన ఫ్రెండ్ తో కలిసి కేరళకు వెళ్తాడు. అక్కడ సుందరిని కలుస్తాడు. ఆమె తన సిస్టర్‌తో కలిసి ఒక గెస్ట్ హౌస్ ని రన్ చేస్తుంటుంది.


Read Also : మనుషుల్ని మటన్లా తినే వంశం… ఈ సైకోల ట్రాప్ లో కాలేజ్ స్టూడెంట్స్… ప్యాంట్ తడిపించే సీన్లు

సుందరి చాలా గ్రేస్‌ఫుల్, ట్రెండీ గర్ల్. కేరళ అందాల మధ్య జీవితం గడుపుతుంది. మొదటి మీటింగ్‌లోనే కల్చరల్ డిఫరెన్సెస్ కారణంగా కామెడీ మొదలవుతుంది. కేరళలో మీట్ అయిన తర్వాత, వాళ్ల మధ్య రొమాన్స్ పెరుగుతుంది. కానీ కల్చరల్ క్లాషెస్ చాలా ఫన్నీ సిచువేషన్స్ తీసుకువస్తాయి. పరం పరం తన యాప్ డెవలప్ చేస్తుంటే, సుందరి అతనికి ఇన్‌స్పిరేషన్ అవుతుంది. వాళ్లు ఒకరి కల్చర్‌ని ఒకరు ఎంజాయ్ చేస్తూ, కామెడీ క్రియేట్ చేస్తారు. ఇంతలో చిన్న మిస్‌ అండర్‌స్టాండింగ్ కారణంగా వాళ్ల లవ్ స్టోరీకి ప్రాబ్లమ్ వస్తుంది. ఇక స్టోరీ క్లైమాక్స్ కి వస్తుంది. పరం, సుందరి లవ్ స్టోరీకి వచ్చిన ప్రాబ్లమ్‌ ఏమిటి ? పరం తన AI యాప్‌ను సక్సెస్ చేస్తాడా ? ఈ సినిమా హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : పక్కింటి అమ్మాయిపై ఆ ఫీలింగ్…తేడా అంటూ కోడై కూసే ఊరు… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ఈ వారం రాబోతున్న కొత్త మలయాళం సినిమాలు… ఆ మూడూ ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్

OTT Movie : పట్టణం కింద దెయ్యాల ప్రపంచం… భయపడితే చంపేసే సైతాన్… ఈ వీకెండ్ కు మూవీ సెట్టు భయ్యా

Kantara 1 OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తోన్న కాంతార 1, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ మూవీస్.. ఆ రెండు మిస్ అవ్వకండి..

OTT Movie : మనుషుల్ని మటన్లా తినే వంశం… ఈ సైకోల ట్రాప్ లో కాలేజ్ స్టూడెంట్స్… ప్యాంట్ తడిపించే సీన్లు

OTT Movie : కళ్ళముందే పార్ట్స్ పార్ట్స్ గా కట్టయ్యే మనుషులు… దెయ్యాల నౌకలో దరిద్రపుగొట్టు సైకో కిల్లర్

Big Stories

×