Shreyas Iyer: టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer) అభిమానులకు భారీ ఊరట లభించింది. శ్రేయాస్ అయ్యర్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు వైద్యులు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు ప్రకటన చేశారు. దాదాపు రెండు రోజుల పాటు ఐసీయూలో ఉన్న శ్రేయాస్ అయ్యర్.. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు ప్రకటించారట. ఈ విషయాన్ని క్రిక్ బజ్ అధికారికంగా వెల్లడించింది.
సిడ్ని వైద్యులు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఐసీయూలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer health update)బయటకు వచ్చాడట. ప్రస్తుతం ఆయన సాధారణ వార్డులోనే చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి టీం.. ప్రత్యేక డాక్టర్ ను కేటాయించిందని.. క్రిక్ బజ్ వెల్లడించింది. శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యాన్ని ఆ డాక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. శ్రేయాస్ అయ్యర్ వేగంగానే కోలుకుంటున్నాడట.
టీమిండియా ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer) ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో ఆయన కుటుంబం టెన్షన్ లో ఉంది. ఈ తరుణంలోనే, శ్రేయాస్ అయ్యర్ ఫ్యామిలీని సిడ్నికి పంపించే ప్రయత్నాలు మొదలుపెట్టింది బీసీసీఐ. ఈ మేరకు ప్రత్యేక విమానమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఓ ప్రైవేట్ విమానంలో వాళ్లను పంపించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందట. దీంతో సిడ్నికి వెళ్లేందుకు అయ్యర్ ఫ్యామిలీ కూడా రెడీ అయిందట.
ఇటీవల గాయపడ్డ శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer) కెరీర్ లో అన్ని బాధలే, ప్రమాదాలే చోటు చేసుకున్నాయి. శ్రేయాస్ అయ్యర్ కు ఒక్క గాయమే కాదు, గతంలో కూడా అతనికి అనేక సమస్యలు వచ్చి పడ్డాయి. 2021 సంవత్సరంలో గాయం కారణంగా టీమిండియా జట్టులో నుంచే తొలగించబడ్డాడు. అప్పుడు గాయం కాకపోయి ఉంటే ఇప్పుడు టీమిండియాలో స్టార్ గా మారిపోయేవాడు. ఇక 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. బీసీసీఐ ( The Board of Control for Cricket in India) మాటను బేఖతరు చేసినందుకుగాను.. అతనిపై చర్యలు తీసుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే టీం ఇండియాలో కొనసాగుతున్న శ్రేయాస్ అయ్యర్.. రెడ్ బాల్ క్రికెట్ లో ఆడుదాం అనుకుంటే బ్యాక్ పెయిన్ అతన్ని వేదిస్తోందట. ఇక టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ కు గాయం అయింది.
🚨🔴 Shreyas Iyer is safe.
He is out of the ICU after a spleen injury and is in stable condition now. | Reported by Cricbuzz. pic.twitter.com/ELGefIdB9O
— Selfless⁴⁵ (@SelflessCricket) October 27, 2025