E-Paper
Advertisement

SSMB 29: జక్కన్న కమర్షియల్ బ్రెయిన్.. ఈవెంట్ రైట్స్ ను హాట్ స్టార్ ఎన్ని కోట్లకు దక్కించుకుందంటే ?

SSMB 29: జక్కన్న కమర్షియల్ బ్రెయిన్.. ఈవెంట్ రైట్స్ ను హాట్ స్టార్ ఎన్ని కోట్లకు దక్కించుకుందంటే ?
Advertisement

SSMB 29: తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి.. చిత్ర పరిశ్రమకే కాదు తనకంటూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు రాజమౌళి (Rajamouli). ‘ శాంతినివాసం’ అనే సీరియల్ ఎపిసోడ్ తో డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి ‘స్టూడెంట్ నెంబర్ – 1’ సినిమాతో దర్శకుడిగా మారి సత్తా చాటుతూ నేడు అంతర్జాతీయ స్థాయిలో మహేష్ బాబు చేత ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య 2027లో రాబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అభిమానులలో ఇప్పటినుంచే అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు జక్కన్న.

గ్లోబ్ ట్రోటర్ హక్కులు జియో హాట్ స్టార్ కే..

అందులో భాగంగానే గ్లోబ్ ట్రోటర్ అంటూ ఒక ఈవెంట్ ను నవంబర్ 15వ తేదీన చాలా ఘనంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జక్కన్న ఉపయోగించిన బ్రెయిన్ కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈవెంట్ నిర్వహిస్తూ సినిమా కోసం ప్రమోషన్ చేయడమే కాకుండా ఈ సినిమా హక్కులను కూడా ఓటీటీ ప్లాట్ ఫారం కు అమ్మేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. విషయంలోకి వెళ్తే.. ఈ లైవ్ ఈవెంట్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

జక్కన్న మాస్టర్ ప్లాన్ అదుర్స్..

Advertisement

ఇకపోతే నవంబర్ 15న హైదరాబాద్లోనే రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగే ఈవెంట్లో మహేష్ బాబు లుక్ తో పాటు సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈవెంట్ కి ఏ మీడియా సంస్థకి కూడా ఆహ్వానం లేదంటూ కరాకండిగా చెప్పేశారు జక్కన్న. కారణం ఈవెంట్ మొత్తానికి రూ.30 కోట్ల ఖర్చు వస్తుందట.. దానికి కూడా బిజినెస్ యాంగిల్ లో ఆలోచించిన జక్కన్న.. ఈవెంట్ రైట్స్ ని జియో హాట్ స్టార్ కి ఏకంగా రూ. 50 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. మొత్తానికి అయితే రాజమౌళి కమర్షియల్ గా ఆలోచిస్తాడు అనడానికి ఇది చక్కటి నిదర్శనం అనడంలో సందేహం లేదని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలు చేస్తున్నారు అంటే కచ్చితంగా నిర్మాతలకు నష్టమైతే రాదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.

also read:Regina Cassandra: అప్పుడే తల్లైన రెజీనా.. వీడియో వైరల్!

ఈవెంట్ కోసం ఎదురుచూపు..

Advertisement

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ , మహేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇంత పెద్ద సినిమాలో ఎంతోమంది నటిస్తున్నప్పటికీ కేవలం ఈ ముగ్గురికి సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సెలబ్రిటీలను ఎన్నడూ ఊహించని పాత్రల్లో పరిచయం చేస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇప్పటికే కుంభ పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నట్లు పోస్టర్ తో సహా ప్రకటించగా.. మరొకవైపు చీర కట్టుకొని యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తున్న మందాకిని పాత్రలో ప్రియాంకను చూపించబోతున్నారు. ఇప్పటివరకు అయితే ఈ రెండు పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేసాయి. మరి మహేష్ బాబు పోస్టర్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

Big Stories

Advertisement
×