Rajinikanth: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఒకరు. ఏడుపదుల వయసులో కూడా రజనీకాంత్ యువ హీరోలకు పోటీ ఇస్తూ పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈయన కూలీ సినిమా(Coolie Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు పూర్తి అయ్యాయి. ఇలా రజనీకాంత్ 5 దశాబ్దాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తున్నారు.
50 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి ….
ఇటీవల కాలంలో హీరో హీరోయిన్లు అభిమానులు గుడులు (Temple)కట్టి పూజలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రజినీకాంత్ అభిమానులు ఆయనకు గుడికట్టి పూజలు చేస్తున్నారు. కార్తీక్(Karthik) అనే ఒక అభిమాని రజనీకాంత్ కు గుడి కట్టి ఆలయంలో 300 కిలోల బరువైన రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా పూజలు చేస్తూ అన్నదానం నిర్వహించేవారు. తాజాగా రజనీకాంత్ 50 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన అభిమాని కార్తీక్ తను ఏర్పాటు చేసుకున్న ఆలయంలో రజనీకాంత్ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
5,500 ఫోటోలతో ఆలయ అలంకరణ..
ఇక రజనీకాంత్ సినీ కెరియర్ లోకి వచ్చినప్పటి నుంచి మొదలుకొని ప్రస్తుత సినిమాల వరకు సుమారు 5,500 ఫోటోలతో ఆలయాన్ని అలంకరించి పెద్ద ఎత్తున అభిషేకాలు పూజలను నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రజినీకాంత్ గారి పట్ల చూపిస్తున్న అభిమానానికి రజనీ ఫ్యాన్స్ ఫిదా అవుతూ కామెంట్లు చేయగా, మరికొందరు… మాత్రం విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక నటుడిని ఇంతలా ఆరాధించడం చూస్తున్న నెటిజన్లు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కూలీ ప్రమోషన్లలో బిజీగా..
ఇకపోతే రజనీకాంత్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో కూలీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికి భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు కాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, ఉపేంద్ర నాగార్జున సత్యరాజు శృతిహాసన్ పూజా హెగ్డే వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక రజనీకాంత్ జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే కూలీ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి