Secunderabad Station Trains Shift: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగించే 32 రైళ్లను తాత్కాలికంగా ఇతర రైల్వే స్టేషన్లకు మార్చుతున్నట్లు వెల్లడించారు. ఈ రైళ్లు హైదరాబాద్, చర్లపల్లి, కాచిగూడ, ఉమ్దానగర్, మల్కాజ్ గిరి స్టేషన్లతో సహా ఇతర టెర్మినల్స్ షిఫ్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల దృష్ట్యా రైళ్ల మార్పుకు రైల్వే బోర్డు ఆమోదించినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది.
22 రైళ్లు చర్లపల్లి స్టేషన్ కు షిఫ్ట్!
ప్రస్తుతం 22 రైళ్లు చర్లపల్లి నుంచి రాకపోకలు కొనసాగిస్తాయి. వీటిలో రోజువారీ నడిచే సికింద్రాబాద్-మణుగూరు (12747), మణుగూరు-సికింద్రాబాద్ (12746), సికింద్రాబాద్-రేపల్లె (17645), రేపల్లె-సికింద్రాబాద్ (17646), వారానికోసారి నడిచే సికింద్రాబాద్-సిల్చార్ (12513), సిల్చార్-సికింద్రాబాద్ (12514), వారానికి రెండుసార్లు నడిచే సికింద్రాబాద్-దర్భంగా (17007), దర్భంగా-సికింద్రాబాద్ (17008) రైళ్లు ఉన్నాయి.
వీక్లీ రైళ్లు రక్సువల్-హైదరాబాద్ (07052), హైదరాబాద్-రక్సుల్ (07051), సికింద్రాబాద్-రామేశ్వరం (07695), రామేశ్వరం-సికింద్రాబాద్ (07696), సికింద్రాబాద్-దానపూర్ (07647), దానపూర్-సికింద్రాబాద్ (07648), వారానికి రెండుసార్లు నడిచే సికింద్రాబాద్-సంత్రాగచి (07221), సంత్రాగచి-సికింద్రాబాద్ (07222) రైళ్లు ఉన్నాయి. వీక్లీ రైళ్లు అయిన సికింద్రాబాద్-ముజఫర్‌పూర్ (05294), ముజఫర్‌పూర్-సికింద్రాబాద్ (05293), సికింద్రాబాద్-అగర్తల (07030), అగర్తల-సికింద్రాబాద్ (07029), త్రైవారం సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ (12735), యశ్వంత్‌పూర్-సెకందర్6 (12736) రైళ్లు ఉన్నాయి.
ఏ రైళ్లు ఏ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తాయంటే?
అటు రోజువారీ నడిచే సికింద్రాబాద్-పుణే (12026), పూణే-సికింద్రాబాద్ (12025) రైళ్లు హైదరాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తాయి. విజయవాడ-సికింద్రాబాద్ (12713), విజయవాడ-సికింద్రాబాద్ (12714) డైలీ కాచిగూడ నుంచి తన సర్వీసులు కొనసాగించనుంది. అటు వీక్లీ రైళ్లు అయిన సికింద్రాబాద్-పోర్బందర్ (20967), పోర్బందర్-సికింద్రాబాద్ (20968) ఉమ్దానగర్ నుంచి తన సర్వీసులను కొనసాగిస్తుంది. సికింద్రాబాద్-సిద్దిపేట, సిద్దిపేట-సికింద్రాబాద్ రైళ్లు వారానికి ఆరు రోజులు మల్కాజ్ గిరి నుంచి తమ సేవలను కొనసాగించనున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఈ రైళ్లు ఆయా రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు. ఈ నెలలో సికింద్రాబాద్ నుంచి మైసూరు వైపు.. చర్లపల్లి నుంచి కాకినాడ టౌన్ సహా ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ రైళ్లు సికింద్రాబాద్ తో పాటు చర్లపల్లి నుంచి రాకపోకలు కొనసాగించనున్నట్లు వెల్లడించారు.
Read Also: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!