BigTV English

Rajinikanth: శ్రీదేవికి ప్రపోజ్ చేయాలనుకున్న రజినీకాంత్.. కానీ, అంతలో

Rajinikanth: శ్రీదేవికి ప్రపోజ్ చేయాలనుకున్న రజినీకాంత్.. కానీ, అంతలో

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక బస్సు కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు ఆయన ఎదిగిన విధానం ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలిగిన రజనీకాంత్  ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న చిత్రాల్లో కూలీ ఒకటి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్,  శృతిహాసన్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.


 

ఇక కూలీ సినిమా  రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం నిత్యం ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లు పెడుతూ సినిమా విషయాలతో పాటు వారి వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ వస్తున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా రజనీకాంత్ కు సంబంధించిన ఒక రేర్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే అందాల అతిలోక సుందరి శ్రీదేవికి రజినీకాంత్ ఒకానొక సమయంలో ప్రపోజ్ చేయాలనుకున్నాడట. శ్రీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం గురించి, అభినయం గురించి అందరికీ తెలిసిందే.


 

అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోలు శ్రీదేవి వెనుక ప్రేమ, పెళ్లి అంటూ తిరిగారని ఎన్నో వార్తలు వినిపించాయి.  అందులో రజనీకాంత్ కూడా ఉన్నాడని డైరెక్టర్ కె బాలచందర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషంగా మారింది. అయితే ఈ వార్త ఎప్పటిదో అయినా కూడా తాజాగా మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది రజనీకాంత్ శ్రీదేవి కలిసి నటించారు ఇక శ్రీదేవి పై మనసు పారేసుకున్న రజినీకాంత్ ఆమెకు ప్రపోజ్ చేయడానికి కూడా ప్రయత్నించాడని కే బాలచందర్ చెప్పుకొచ్చాడు.

 

” అప్పట్లో శ్రీదేవి ఒక కొత్త ఇల్లు నిర్మించింది. ఆ గృహప్రవేశానికి  స్టార్ సెలబ్రిటీలందరిని  ఆహ్వానించింది. ఇక ఆ సమయంలోనే రజినీకాంత్ తన ప్రేమను శ్రీదేవికి వ్యక్తపరచాలని అనుకున్నాడు. అదే మంచి రోజని భావించి పూర్తిగా ప్రిపేర్ అయ్యి శ్రీదేవి గృహప్రవేశానికి వెళ్ళాడు. అలా ఆయన కొత్తింట్లో అడుగుపెట్టాడో.. లేదో ఇలా కరెంటు పోయింది. ఇల్లంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. అది చూసి రజిని షాక్ అయ్యాడు. ఇదేంటి ఎంతో ఆశతో తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి వస్తే ఇలా జరిగింది ఏంటి అంటూ బ్యాడ్ సెంటిమెంట్ గా ఫీల్ అయ్యాడు. ఇక తర్వాత ఇదేదో మంచి శకునం కాదు అనుకొని శ్రీదేవికి తన మనసులోని మాట చెప్పకుండానే బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆ మాటను రజిని, శ్రీదేవికి చెప్పలేదని కె బాలచందర్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. అలా రజనీకాంత్- శ్రీదేవి మధ్య ప్రేమ దూరమైంది. ఆ తరువాత రజినీ.. లతాను వివాహం చేసుకున్నారు.

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×