Mohammed Siraj : ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ 2-2 తో సమానం అయింది. ఈ సిరీస్ ను ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంటుందని చివరి వరకు అంతా అనుకున్నారు. నిన్న 35 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో మ్యాచ్ ని ముగించారు. అప్పటికీ 6 వికెట్లు ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్ జట్టు ఇవాళ వరుసగా వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు సిరాజ్, ప్రసిద్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ని విజయం వరించింది. మరోవైపు కొన్ని క్యాచ్ లు, ఫీల్డింగ్ లో కూడా పొరపాట్లు చేసింది టీమిండియా.. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ గిల్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
Also Read : Woaks one hand batting : ఒంటి చేతితో బ్యాటింగ్ చేసిన క్రిస్ వోక్స్.. 1986లో సలీం మాలిక్ ఇలాగే..!
ఉత్కంఠలో విజయం
“ఈ సిరీస్ లో టీమిండియా, ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. ఈ మ్యాచ్ ఐదు రోజు విషయానికి వస్తే.. ఇరు జట్లకు సమంగా విజయ అవకాశాలు ఉండేవి. ఎవ్వరూ గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఎవ్వరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఈ ఉత్కంఠపోరులో మేము పై చేయి సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. సిరాజ్, ప్రసిద్ధ్ లాంటి బౌలర్లు ఇంత అద్భుతంగా బౌలింగ్ చేస్తే.. ఎవ్వరికైనా కెప్టెన్సీ చాలా సులభం అనిపిస్తుంది. వారిద్దరూ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ బౌలింగ్ చేశారు. పాత బంతితో మాకు ఎటువంటి సమస్య లేదనిపించింది. బంతి రెండు వైపులా మంచిగా మూవ్ అయింది. అందుకే కొత్త బంతిని తీసుకోలేదు. అయితే ప్రారంభంలో మాపై కొంత ఒత్తిడి ఉండేది. కానీ గెలుస్తామన్న నమ్మకం అయితే మాకు ఉండేది. వారిని ఒత్తిడికి గురి చేయాలనుకున్నాం. ఒత్తిడితో ఎటువంటి జట్టు అయినా తప్పిదాలు చేస్తుంది. మా ప్రణాళికలకు తగ్గటే బౌలర్లు అద్భుతంగా రాణించారు.
ఆ ఒక్కడు చాలు..
మహ్మద్ సిరాజ్ ఒక సంచలనం.. అటువంటి బౌలర్ ఒక్కడు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు.. ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ మొత్తం అతను అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ప్రతీ బంతిని ప్రాణం పెట్టి బౌలింగ్ చేశాడు. ఈ విజయానికి మేము అన్ని రకాలుగా అర్హులం. ఈ సిరీస్ లో టాప్ రన్ స్కోరర్ గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు నేను చాలా కష్టపడ్డాను. ఈ సిరీస్ లో బెస్ట్ బ్యాటర్ గా ఉండటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పుడు నా లక్ష్యాన్ని అందుకున్నాను” అని గిల్ పేర్కొన్నారు. ఇవాళ ప్రసిధ్, సిరాజ్ బౌలింగ్ లో ప్రతిభ కనబరచడంతోనే టీమిండియా విజయం సాధించింది. లేదంటే తృటిలో ఇంగ్లాండ్ జట్టు సిరీస్ కైవసం చేసుకునేది. టీమిండియా కి ఇది లక్ అనే చెప్పాలి.