Heavy rain: హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, ప్యాట్నీ ప్యారడైజ్, మారేడుపల్లి, చిలకలగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, కూకట్ పల్లి, హైదర్ నగర్, అమీర్ పేట, వివేకానంద నగర్, హిమాయత్ నగర్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, బేగంపేట పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీ వరద నీరు చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
వనస్థలిపురం, హయత్ నగర్, పంజాగుట్ట, కూకట్ పల్లి, కార్వాన్, గోల్కొండ, జియాగూడ, సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం పడుతోంది. భారీ వర్షం ప్రభావంతో బంజారా హిల్స్, హైదరాబాద్ సెంట్రల్, మేడ్చల్ సర్కిల్ ప్రాంతాల్లోని 56 11 kv ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో అతి తక్కువ సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. వైశాలి నగర్, నవీన్ నగర్, ఓయూ కాలనీ, JVG హిల్స్, మూన్ కేఫ్ ఫీడెర్, IDPL, వసుధా, మధురా నగర్, వంటి ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల పై ఫారిన్ మెటీరియల్స్ పడటంతో బ్రేక్ డౌన్ అయ్యాయి. వాటిని కూడా అధికారులు పునరుద్ధిరించారు.
ఈ ఏడాది రికార్డు వర్షపాతం నమోదు…
ఇక ఈ ఏడాది అత్యధిక రికార్డ్ వర్షపాత నమోదు అయ్యింది. కుతుబుల్లాపూర్‌లో 151 మి.మీ., బంజారా హిల్స్‌లో 125 మి.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇదే అత్యధిక వర్షపాత మని చెప్పారు. ఆగస్టు నెలలో భారీ వర్షాలకు ఇది కొంత పవర్ ప్యాక్ ప్రారంభమని చెప్పవచ్చు. ఈ నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
మరో రెండు గంటల్లో భారీ వర్షం…
మరో రెండు గంట్లలో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మేడ్చల్, మెదక్, సిద్దిపేట, జనగామ, నారాయణపేట, వికారాబాద్, గద్వాల్ లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అలాగే కామారెడ్డి, హన్మకొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. పలుచోట్ల పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గచ్చిబౌలిలో భారీ శబ్దంతో పిడుగు….
ఈ రోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలో పిడుగు పడింది. గచ్చిబౌలి పరిధి ఖాజాగూడలోని లంకోహిల్స్ సర్కిల్ HP పెట్రోల్ బంక్ ఎదురుగా భారీ శబ్ధంతో పిడుగు పడింది. రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టుపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడడంతో జనం భయపడి పరుగులు తీశారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
మైత్రీవనం వద్ద భారీ వరద.. ఖాజాగూడలో పిడుగు
నీట మునిగిన అమీర్‌పేట మెట్రో స్టేషన్, స్వర్ణ జయంతి కాంప్లెక్స్
గచ్చిబౌలి పరిధి ఖాజాగూడలోని లంకోహిల్స్ సర్కిల్ HP పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న తాటిచెట్టుపై పడిన పిడుగు pic.twitter.com/BT7jNiFPzY
— BIG TV Breaking News (@bigtvtelugu) August 4, 2025
ALSO READ: Guvvala Balaraju: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా..