E-Paper
Advertisement

Raju Weds Rambai: ఆల్ టైం లోయెస్ట్ ప్రైజ్ తో మూవీ టికెట్స్… రాజు వెడ్స్ రాంబాయ్ కి కలిసొస్తుందా?

Raju Weds Rambai: ఆల్ టైం లోయెస్ట్ ప్రైజ్ తో మూవీ టికెట్స్… రాజు వెడ్స్ రాంబాయ్ కి కలిసొస్తుందా?
Advertisement

Raju Weds Rambai: ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సంస్థ నుంచి “రాజు వెడ్స్ రాంబాయి” (Raju Weds Rambai)అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 21వ తేదీ థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో భాగంగా సినిమా టికెట్ ధరల గురించి ఈటీవీ సంస్థ అధినేత సాయి కృష్ణ(Sai Krishna) ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తక్కువ ధరకే రాజు వెడ్స్ రాంబాయి టికెట్ ధరలు..

ఇటీవల కాలంలో ఒక సినిమా విడుదల అవుతుంది అంటే కచ్చితంగా సినిమా టికెట్లు రేట్లు పెంచమని ప్రభుత్వాలను ఆశ్రయించి సినిమా టికెట్ల రేట్లు భారీగా పెంచుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకు మాత్రం పూర్తి స్థాయిలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఈ సినిమా టికెట్ ధరల ఎలా ఉన్నాయినే విషయానికి వస్తే.. ఈ సినిమా సింగిల్ స్క్రీన్ టికెట్ ధర కేవలం రూ.99 కాగా, మల్టీప్లెక్స్ లో రూ.105 ధరలకే సినిమాని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ ధరలు చాలా తక్కువ అని చెప్పాలి.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసమే..

Advertisement

సినిమాల టికెట్ల రేట్లు పెంచుతున్న నేపథ్యంలోని ప్రేక్షకులు థియేటర్లకు దూరంగా ఉన్నారనే వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసమే ఈ సినిమాకు టికెట్ ధరలు పూర్తిగా తగ్గించినట్లు సాయి కృష్ణ వెల్లడించారు. అయితే ఇంత తక్కువ ధరలతో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సరైన నిర్ణయమేనా? ఈ ఆలోచన రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు ఏ విధంగా కలిసొస్తుంది? అనేది తెలియాల్సి ఉంది. సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు లేదంటే పెద్ద ఎత్తున ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాలి.

వాస్తవ సంఘటనల ఆధారంగా..

Advertisement

ఇక ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు దర్శకుడు సాయిలు కంపాటి వెల్లడించారు. సాయిలు దర్శకత్వంలో అఖిల్ (Akhil)తేజస్విని (Tejaswini)జంటగా నటించిన ఈ సినిమా వరంగల్, ఖమ్మం జిల్లాల మధ్య జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీవాస్ లు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి నవంబర్ 21వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ వస్తుంది? తక్కువ టికెట్ల ధరతో ఈ సినిమా సంచలనాలను సృష్టించబోతోందా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: IBomma one: ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది.. ఇప్పుడు పోలీసులకు డబుల్ సవాల్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×