Hyper Aadi: హైపర్ ఆది (Hyper Aadi)పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్న హైపర్ ఆది అతి తక్కువ సమయంలోనే సినిమా అవకాశాలను కూడా అందుకుని మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం బుల్లితెర పై శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు ఢీ డాన్స్ షో కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. హైపర్ ఆది తన కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. అయితే కొన్నిసార్లు హైపర్ ఆది చేసే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి ఈయన పరోక్షంగా కొంతమందిని టార్గెట్ చేస్తూ మాట్లాడతారనే వాదన వినిపిస్తుంది.
తాజాగా ఢీ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర నటి దీపికా రంగరాజు(Deepika Rangaraju) కూడా పాల్గొని సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కెమెరామెన్ శివతో కలిసి దీపిక వేదికపై డాన్స్ వేయడంతో హైపర్ ఆది ఈ పర్ఫామెన్స్ పై స్పందించారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ నేను కనుక సినిమా చేస్తే గుండు అంకుల్… బండ ఆంటీ అనే టైటిల్ పెట్టీ మీ ఇద్దరితో ఒక సినిమా చేస్తా అంటూ మాట్లాడారు. ఇలా హైపర్ ఆది దీపికాను పట్టుకొని బండ ఆంటీ అంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో సంచలనగా మారాయి.
ఇలా హైపర్ ఆది ఇతరుల బాడీ షేమింగ్ గురించి మాట్లాడటం ఇది మొదటిసారి కాదని గతంలో కూడా ఎంతోమందిని ఉద్దేశించి ఇలా మాట్లాడారు అంటూ హైపర్ ఆది మాటతీరు పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై దీపికా అభిమానులు స్పందిస్తూ.. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి ముందు మీ పొట్ట చూసుకోండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం హైపర్ ఆది చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో హైపర్ ఆది విమర్శలను ఎదుర్కొంటున్నారు మరి ఈ విషయంపై దీపిక స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
బ్రహ్మముడి సీరియల్ తో గుర్తింపు..
ఇక దీపిక ప్రస్తుతం తెలుగులో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసింది. ఈమె తమిళ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దీపిక బ్రహ్మముడి సీరియల్ లో కావ్య పాత్రలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సీరియల్ తర్వాత కావ్య ఇతర సీరియల్స్ కు కమిట్ అవ్వకపోయినా బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక హైపర్ ఆది ఒకవైపు బుల్లి తెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు వెండితెర సినిమాలలో కూడా కమెడియన్ గా కొనసాగుతూ బిజీగా ఉన్నారు.
Also Read: Sachin Chandwade: సూసైడ్ చేసుకున్న యంగ్ హీరో.. ఆలస్యంగా వెలుగులోకి?