BigTV English
Advertisement

OTT Movie : పట్టణం కింద దెయ్యాల ప్రపంచం… భయపడితే చంపేసే సైతాన్… ఈ వీకెండ్ కు మూవీ సెట్టు భయ్యా

OTT Movie : పట్టణం కింద దెయ్యాల ప్రపంచం… భయపడితే చంపేసే సైతాన్… ఈ వీకెండ్ కు మూవీ సెట్టు భయ్యా

OTT Movie : వెన్నులో వణుకు పుట్టించే సీన్లు, అదిరిపోయే థ్రిల్ తో ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమా ‘ఇట్‌’. 2017లో వచ్చిన ఈ సినిమాలో జోకర్ దెయ్యం చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. భయపడే కొద్దీ, ఈ జోకర్ దెయ్యం రెచ్చిపోతుంటుంది. ముఖ్యంగా పిల్లల మీద దీని ప్రాతాపం చూపిస్తుంటుంది. దీని తరువాత 2019లో ‘ఇట్ చాప్టర్ 2’ కూడా సూపర్ హిట్ అయింది. చాలా కాలం తరువాత ‘ఇట్‌ : వెల్‌క‌మ్ టు డెర్రీ’ అనే సిరీస్ తో ఆడియన్స్ ను పరుగులు పెట్టిస్తోంది. ఈ రోజు నుంచి ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పిల్లలు దుష్టశక్తిని ఎదుర్కొనే క్రమంలో ఈ సిరీస్ ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ సిరీస్ ని చూడటానికి, ఆడియన్స్ కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘ఇట్‌:వెల్‌క‌మ్ టు డెర్రీ’ (IT: Welcome To Derry) హారర్ వెబ్ సిరీస్ ను ఆండీ ముషీటి, బర్బరా ముషీటి, రూపొందించారు. స్టీఫెన్ కింగ్ 1986లో రాసిన నవల ‘ఇట్’ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఇందులో ఇందులో టేలర్, జోవన్, బ్లేక్ కామెరాన్, క్రిస్, జేమ్స్, స్టీఫెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 27 నుంచి, డిసెంబర్ 14 వరకూ ఈ ఎపిసోడ్ లు రిలీజ్ అవుతుంటాయి.

కథలోకి వెళ్తే

‘1962లో డెర్రీ అనే చిన్న టౌన్‌లో ఈ కథ జరుగుతుంది. లెరాయ్, అతని భార్య షార్లట్ తమ కొడుకు విల్‌తో కలిసి డెర్రీకి కొత్తగా వస్తారు. లెరాయ్ మిలిటరీ బేస్‌లో జాబ్ చేస్తుంటాడు. వాళ్లు టౌన్‌లో సెటిల్ అవుతుంటే, అదే సమయంలో ఒక చిన్న పిల్లవాడు మాయమవుతాడు. ఈ ఇన్సిడెంట్‌తో టౌన్‌లో భయం మొదలవుతుంది. డెర్రీలో ఇలా జరగటం మొదటి సారి కాదు. చాలా సంవత్సరాలుగా పిల్లలు మిస్ అవుతున్నారు. ఎవరూ దీని వెనుక ఉన్న కారణం కనుక్కోలేక పోతారు. టౌన్‌లో పెన్నీవైజ్ అనే ఒక క్రీపీ క్లౌన్ కనిపిస్తాడు. అతను పిల్లల భయాలను ఉపయోగించి, షేప్ మార్చుకుని వాళ్ళపై దాడులు చేస్తుంటాడు. లెరాయ్ ఫ్యామిలీ డెర్రీలో సెటిల్ అవుతుంటే, టౌన్‌లో మరిన్ని పిల్లలు మాయమవుతారు.


Read Also : కోరికలతో అల్లాడే శవం… ప్రాణం పోసిన వాడితోనే… ఈ దెయ్యానికి ఒంటరి మగాడు దొరికితే దబిడి దిబిడే

పెన్నీవైజ్ సూపర్‌ నాచురల్ పవర్స్ తో టౌన్‌లో ఉండే, ఒక అండర్ గ్రౌండ్ నుంచి పిల్లలను టార్గెట్ చేస్తుంటాడు. దీంతో లెరాయ్, షార్లట్ తమ కొడుకు విల్‌ను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ సమయంలో విల్ డెర్రీ హిస్టరీని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో పెన్నీవైజ్ ఈ టౌన్‌లో ఎప్పటి నుండో ఉన్నాడని, ప్రతి 27 సంవత్సరాలకు మళ్లీ వస్తాడని తెలుస్తుంది. ఇప్పుడు విల్ కి పెన్నీవైజ్‌ సీక్రెట్ తెలిసిపోతుంది. పెన్నీవైజ్ ఒక ఏలియన్ అని, డెర్రీకి వందల సంవత్సరాల క్రితం వచ్చాడని కనిపెడతాడు. పిల్లల భయాలతో తన ఉనికిని చాటుకుంటూ ఉంటాడని తెలుస్తుంది. లెరాయ్, షార్లట్, విల్, మరికొంత మంది టౌన్ పిల్లలు పెన్నీవైజ్‌ను ఎదుర్కొంటారు. చివరికి వీళ్ళంతా పెన్నీవైజ్ ను ఒడిస్తారా ? దాని చేతిలో బలవుతారా ? అనే విషయాలను, ఈ హారర్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : పక్కింటి అమ్మాయిపై ఆ ఫీలింగ్…తేడా అంటూ కోడై కూసే ఊరు… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ఈ వారం రాబోతున్న కొత్త మలయాళం సినిమాలు… ఆ మూడూ ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ వివాదాస్పద మూవీ… 84 కోట్ల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఏ ఓటీటీలో ఉందంటే?

Kantara 1 OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తోన్న కాంతార 1, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ మూవీస్.. ఆ రెండు మిస్ అవ్వకండి..

OTT Movie : మనుషుల్ని మటన్లా తినే వంశం… ఈ సైకోల ట్రాప్ లో కాలేజ్ స్టూడెంట్స్… ప్యాంట్ తడిపించే సీన్లు

OTT Movie : కళ్ళముందే పార్ట్స్ పార్ట్స్ గా కట్టయ్యే మనుషులు… దెయ్యాల నౌకలో దరిద్రపుగొట్టు సైకో కిల్లర్

Big Stories

×