ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి భారతీయ రైల్వే విస్తృత శ్రేణి రైలు సేవలను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా 2019లో తొలి ప్రైవేట్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైలును ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ రైలు తొలిసారి న్యూఢిల్లీ- లక్నో రూట్ లో అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 4, 2019లో తొలిసారి తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఒక నెలలోనే IRCTCకి ఈ రైలు ద్వారా సుమారు రూ. 7.73 లక్షల ఆపరేషనల్ ఇన్ కమ్ లభించింది. ప్రస్తుతం ఈ రైళ్లు న్యూఢిల్లీ- లక్నోతో పాటు ముంబై-అహ్మదాబాద్, ముంబై–మద్గావ్, చెన్నై-మధురై మార్గాల్లో నడుస్తున్నాయి.
ఈ రైలు టికెట్ ధర కూడా వందేభారత్ రైలుకు మించి ఉంటుంది. న్యూఢిల్లీ-లక్నో మార్గంలో నడుస్తున్న ఈ రైలు.. అదే మార్గంలో నడుస్తున్న రాజధాని, శతాబ్ది, వందే భారత్ ఎక్స్ ప్రెస్ లాంటి ఇతర ప్రీమియం సర్వీసుల కంటే అధిక ఛార్జీలను వసూలు చేస్తుంది. తేజస్ ఎక్స్ ప్రెస్ రెండు తరగతుల సీటింగ్‌ను అందిస్తుంది. అందులో ఒకటి AC చైర్ కార్ కాగా, మరొకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. తేజస్ ఎక్స్ ప్రెస్ లో న్యూఢిల్లీ- లక్నో మధ్య ప్రయాణించడానికి AC చైర్ కార్ కు రూ. 1,679, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌కు రూ. 2,457 ఛార్జ్ చేస్తున్నారు. ఈ మార్గంలో శతాబ్ది, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు టికెట్ ధర AC చైర్ కార్‌కు రూ. 1,255, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీలు శతాబ్దిలో రూ. 1,955, వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో రూ. 2,415గా ఉన్నాయి. IRCTC తేజస్ ఎక్స్ ప్రెస్, రాజధాని ఎక్స్ ప్రెస్, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఇండియన్ రైల్వే డైనమిక్ ఛార్జ్ ను వర్తిస్తుంది. అయితే, వందే భారత్ రైళ్లలో అలాంటి ఛార్జీలు వర్తించవు.
తేజస్ రైలులో వందేభారత్ రైలు సౌకర్యాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయి. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి తేజస్ రైలులో ట్రైన్ హోస్టెస్ ఉంటారు. వీళ్లకు కూడా ప్రత్యేకమైన యూని ఫారమ్ ఉంటుంది. జర్నీలో ప్రయాణీకులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుంటారు. రైలుకు సంబంధించి సమాచారాన్ని కూడా ప్రయాణీకులకు వివరిస్తారు. ప్రతి స్టేషన్ లో రైల్లోకి ఎక్కే ప్రయాణీకును వీళ్లు సాదరంగా స్వాగతం పలుకుతారు. ఈ రైల్లో విలాసవంతమైన ఆహారాన్ని అందిస్తారు. తేజస్ సూపర్ లగ్జరీ రైలు గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సత్తాను కలిగి ఉంటుంది. కానీ, అధికారులు ఈ రైలు వేగాన్ని గంటకు 140 కి.మీకి తగ్గించారు. వందేభారత్ కు మించి వేగంతో దూసుకెళ్తాయి. ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ఇవి రైలు ఆగిన స్టేషన్లలో మాత్రమే ఓపెన్ అవుతాయి.
Read Also: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, ఇక ఆ నగరాలకు ఈజీగా వెళ్లొచ్చు!