Ram Gopal Varma Tweet :దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)నిజ జీవితానికి అద్దం పట్టేలా.. రాజకీయాలను ఎక్కువగా ఫోకస్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల వల్ల అటు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాంగోపాల్ వర్మ.. “పోలీసులకే భయం వేస్తే ఎక్కడికి వెళ్తారు?” అంటూ ఒక ట్విట్టర్ పోస్టు షేర్ చేశారు. మరి వర్మ షేర్ చేసిన ఆ ట్విట్టర్ పోస్ట్ వెనుక అసలు అర్థం ఏముంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
మరో కొత్త మూవీతో రాబోతున్న వర్మ..
అసలు విషయంలోకి వెళ్తే.. షూల్, సర్కార్ 3, సత్య వంటి చిత్రాలతో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పేయి (Manoj Bajpayee,) తో కలిసి పని చేసిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే “పోలీస్ స్టేషన్ మే భూత్” అనే హార్రర్ కామెడీ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో జెనీలియా దేశముఖ్ (Genelia deshmukh) హీరోయిన్ గా నటిస్తున్నారు.. ఈ మేరకు రాంగోపాల్ వర్మ తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా ఒక మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ చాలా వింతగా, ఏఐ ఉపయోగించి రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మనోజ్ పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో ఒక భయంకరమైన దెయ్యం బొమ్మను పట్టుకున్నట్టుగా కనిపించాడు.
మోషన్ పోస్టర్ రిలీజ్..
ఈ మోషన్ పోస్టర్ కి రామ్ గోపాల్ వర్మ..” భయపడినప్పుడు పోలీసుల దగ్గరకు పరిగెత్తుతారు. కానీ పోలీసులే భయపడినప్పుడు ఎక్కడికి వెళ్తారు ? అని క్యాప్షన్ జోడించారు. అలాగే ఫస్ట్ లుక్ షేర్ చేస్తూ..” ఒక భయంకరమైన గ్యాంగ్ స్టార్ ను పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ లో చంపేస్తారు..అలా చనిపోయిన వ్యక్తి పోలీస్ స్టేషన్ ను వెంటాడడానికి దెయ్యంగా తిరిగి వస్తాడు. అందుకే పోలీస్ స్టేషన్ మే భూత్ అనే టైటిల్ పెట్టారు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సరికొత్త కథతో వర్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
వర్మ టీట్ పై స్పందించిన మనోజ్
వర్మ చేసిన ట్వీట్ కి మనోజ్ స్పందిస్తూ.. “సత్య నుండీ ఇప్పటివరకు కొన్ని ప్రయాణాలు పూర్తి సంపూర్ణం అవుతాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మా కొత్త హార్రర్ కామెడీ పోలీస్ స్టేషన్ మే భూత్ కోసం వర్మతో తిరిగి కలవడం మరింత ఆనందంగా ఉంది. ఇది ప్రత్యేకమైనది” కూడా అంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు. ఈ చిత్రాన్ని వావ్ ఎమిరేట్స్, కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్, యు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
also read:Anushka Shetty Ghaati: హమ్మయ్య ప్రమోషన్స్ మొదలుపెట్టిన అనుష్క.. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది
https://twitter.com/RGVzoomin/status/1962403308301426893