Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోనే యంగ్ హీరోలలో అత్యధిక సినిమాలకు కమిట్ అయ్యి బిజీ హీరోగా మారిపోయారు. రాజావారు రాణి గారు (Raja Vaaru Rani Gaaru) సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఎస్ ఆర్ కళ్యాణమండపం, సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని వంటి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం “క ” సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు.
మీర్జాపూర్ డైరెక్టర్ తో కిరణ్ అబ్బవరం…
ఈ సినిమా తర్వాత ఇటీవల దిల్ రూబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈయన చెన్నై లవ్ స్టోరీ సినిమాతో పాటు కే రాంప్ వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈయన మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో దాదాపు 8 సినిమాలు ఉన్నాయి అయితే ఈ సినిమాలన్నీ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. తాజాగా కిరణ్ అబ్బవరం పై బాలీవుడ్ దర్శకుడి కన్ను పడిందని తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మిర్జాపూర్(Mirzapur) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్నదో మనకు తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఆనంద్ అయ్యర్ (Anand Ayyar) దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతోంది.
సుకుమార్ రైటింగ్స్ లో కిరణ్ అబ్బవరం సినిమా..
ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా కథ నేపథ్యం ఏంటి, ఇందులో హీరోయిన్ ఎవరనే అంశాల గురించి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చర్చలు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్న సుకుమార్ రైటింగ్స్ లో కూడా మరో సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా ద్వారా సుకుమార్ అసోసియేట్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
మొదటి సినిమా హీరోయిన్ తో పెళ్లి…
ఇలా కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను లైన్ లో పెడుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇలా కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఈయన తన మొదటి సినిమా రాజావారు రాణి గారు సినిమా హీరోయిన్ రహస్య(Rahasya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు. ఈ చిన్నారికి హను అబ్బవరం(Hanu Abbavram) అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇలా కిరణ్ అబ్బవరం వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
Also Read: The Paradise: గ్లోబల్ రేంజ్ లో నాని ది ప్యారడైజ్.. రంగంలోకి హాలీవుడ్?