BigTV English

Ramayana: ‘రాముడు పాత్రలో బీఫ్ తినేవాడా ?’.. ట్రోల్స్‌కి ఆన్సర్ ఇచ్చిన మూవీ టీం!

Ramayana: ‘రాముడు పాత్రలో బీఫ్ తినేవాడా ?’.. ట్రోల్స్‌కి ఆన్సర్ ఇచ్చిన మూవీ టీం!

Ramayana: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) ని రామాయణ మూవీలో రాముడి పాత్రలో తీసుకోవడంతో చాలామంది విమర్శలు చేశారు.అంతేకాదు ఒక బీఫ్ తినే వాడితో,మందు తాగే వాడితో పవిత్రమైన రాముడి పాత్రను చేయించడం తగునా.. అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. ఇక ఈ మధ్యకాలంలో రామాయణ (Ramayana) మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసిన సమయంలో అయితే ఈ విమర్శలు మరీ ఎక్కువయ్యాయి.బీఫ్ తినే వాడితో రాముడి పాత్ర వేయించడమేంటో మా కర్మ అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా ఎంతో మంది నెటిజన్లు రణబీర్ కపూర్ ని ఉద్దేశిస్తూ షాకింగ్ పోస్టులు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.


రాముడి పాత్రతో విమర్శలు ఎదుర్కొన్న రణబీర్..

అయితే ఈ పోస్టులను కొంతమంది వ్యతిరేకిస్తే ఇంకొంతమంది సమర్థించారు. తాజాగా రామాయణ మూవీలో రాముడి పాత్ర కోసం ఇన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. రణబీర్ కపూర్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అనేది రామాయణ చిత్ర యూనిట్ తాజాగా బయట పెట్టింది.మరి ఇంతకీ ఎన్నో విమర్శల మధ్య కూడా రాముడిగా రణబీర్ కపూర్ ని ఎందుకు ఎంచుకున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


బీఫ్ తినేవాడికా రాముడి పాత్ర..

నితేష్ తివారి(Nitesh Tiwari ) డైరెక్షన్లో.. నమిత్ మల్హోత్రా (Namit Malhotra) నిర్మాతగా చేస్తున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ రామాయణ. ఈ రామాయణాన్ని ఇప్పటికే చాలామంది దర్శకులు తెరకెక్కించారు. అయితే అన్ని సినిమాల్లో కథ, క్లైమాక్స్ ఒక్కటే అయినప్పటికీ ఎవరికి నచ్చిన తీరులో వాళ్ళు చూపిస్తారు. అలా నితేష్ తివారి రామాయణ మూవీని రెండు పార్ట్ లుగా తీసుకు రాబోతున్నారు. మొదటి పార్ట్ ని 2026 దీపావళికి, రెండో పార్ట్ ని 2027 దీపావళికి విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్,రావణుడిగా యష్ (Yash) సీత పాత్రలో సాయి పల్లవి(Sai Pallavi), మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్ (Sunny Deol) ని ఎంపిక చేశారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ రాముడి పాత్ర కోసం తీసుకున్న రణబీర్ కపూర్ పై విమర్శలు వచ్చాయి. రణబీర్ గతంలో నేను బీఫ్ లవర్ ని బీఫ్ తింటానంటూ చెప్పారు.అయితే అలాంటి బీఫ్ తినేవాడిని, ఎంతోమంది అమ్మాయిల తో డేటింగ్ లు చేసిన వాడిని తీసుకువచ్చి ఏకపత్నీ వ్రతుడు, హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రాముడి పాత్ర కోసం తీసుకుంటారా అంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.

రూమర్స్ కి చెక్ పెట్టిన చిత్ర బృందం..

అయితే ఈ విమర్శలపై తాజాగా రామాయణ చిత్ర యూనిట్ స్పందిస్తూ.. రణబీర్ కపూర్ ముఖంలో ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది.అయితే రాముడు కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. అందుకే రాముడి పాత్రలో రణబీర్ అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని ఆయన్ని రాముడిగా ఎంపిక చేసాం అంటూ క్యాస్టింగ్ డైరెక్టర్ రణబీర్ కపూర్ రాముడి పాత్రపై క్లారిటీ ఇచ్చేశారు.. రాముడు చూడ్డానికి ఎంతో ఓపిగ్గా ప్రశాంతంగా కనిపిస్తాడు. ఇలాంటి పాత్రలో పీస్ ఫుల్ ఫేస్ ఉన్న వారైతేనే సెట్ అవుతారు.అందుకే రణబీర్ కపూర్ ని తీసుకున్నట్టు చిత్రీ యూనిట్ క్లారిటీ ఇచ్చారు. మరి వీరి క్లారిటీతోనైనా రాముడి పాత్రపై వచ్చే విమర్శలు తగ్గుతాయా లేదా అనేది చూడాలి.

మండోదరి, సీత పాత్రలపై కూడా ట్రోల్స్..

ఇక రాముడు పాత్ర మీద మాత్రమే కాదు మండోదరి పాత్రలో నటించిన కాజల్(Kajal) , సీత పాత్రలో నటించే సాయి పల్లవి విషయంలో కూడా ట్రోల్స్ వచ్చాయి. అంత అందంగా ఉండే మండోదరి పాత్రలో ఉన్న కాజల్ ని వదిలేసి సీత పాత్రలో ఉన్న సాయి పల్లవి కోసం రావణుడు వెళ్తాడా అంటూ ట్రోల్స్ వైరల్ అయ్యాయి. దీంతో అందం గురించి కాదు ముందు పురాణాలు తెలుసుకొని మాట్లాడు అంటూ కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేసిన వారికి కౌంటర్లు ఇచ్చారు.

ALSO READ:R.Madhavan: ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆ హీరోయిన్స్ పనికిరారు.. వివాదానికి తెరలేపిన మాధవన్!

Related News

Tollywood Villain: నిర్మాతగా మారబోతున్న టాలీవుడ్ విలన్.. ఈ ట్విస్ట్ ఏంటి సార్..?

Mirai:  ‘మిరాయ్’ లో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్?..అతనికే ఎక్కువ..?

Disa Patani: దిశా పటాని పై కాల్పులు.. అతనే కారణమా..?

Kishkindhapuri : హరిహర వీరమల్లు కంటే ఆ విషయంలో బెల్లం అన్న సినిమానే టాప్

Big producer : తన బ్యానర్ లో సినిమాలు చేయమని రాయబారాలు పంపుతున్న బడా నిర్మాత

Tollywood star heroes : చిన్న హీరోల పెద్ద హిట్లు, స్టార్ హీరోలు ఇకనైనా తగ్గండయ్యా

Kangana Ranaut: కంగనాపై సుప్రీంకోర్టు ఫైర్.. పిటిషన్ రద్దు!

Anushka Shetty: వాస్తవ ప్రపంచం అదే.. అనుష్కలో ఈ మార్పుకి కారణం?

Big Stories

×