R.Madhavan:తమిళ నటుడు ఆర్. మాధవన్ (R.Madhavan) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈయన నటుడిగా కేవలం తమిళంలోనే కాకుండా దాదాపు 7 భాషల్లో నటించారు. ఇక 7 భాషల్లో నటించిన అతి తక్కువ మంది హీరోల్లో ఈయన కూడా ఒకరు. మాధవన్ నటించిన చెలి (Cheli), సఖి(Sakhi) వంటి సినిమాలు ఇండస్ట్రీలో ఆయన్ని నిలబెట్టాయని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి మాధవన్ నటిస్తున్న తాజా మూవీ ఆప్ జైసా కోయి(Aap Jaisa Koi).. మాధవన్ హీరోగా.. ఫాతిమా సనా షేక్ (Fathina Sana Shaik) హీరోయిన్ గా.. వివేక్ సోనీ (Vivek Sony) దర్శకత్వంలో కరణ్ జోహార్(Karan Johar) నిర్మాతగా వస్తున్న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో జూలై 11 నుండి అందుబాటులోకి రానుంది.
నా మాటలు వివాదానికి దారి తీయవచ్చు – మాధవన్
అయితే తాజాగా ‘ఆప్ జైసా కోయి’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాధవన్ మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో చర్చినీయాంశంగా మారాయి. అయితే ఆయన ఈ మాటలు మాట్లాడుతూనే..” నా మాటలు వివాదానికి దారితీస్తాయి కావచ్చని” కూడా చెప్పారు. పెళ్ళైన హీరోయిన్లు రొమాన్స్ కి పనికిరారు అంటూ ఆయన చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ హీరోయిన్స్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి పనికిరారు – మాధవన్
తమిళ్ నటుడు ఆర్.మాధవన్ విభిన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. సంవత్సరానికి ఒక సినిమా చేయకపోయినా కూడా ప్రేక్షకుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటిస్తున్నారు.అయితే అలాంటి మాధవన్ తాజాగా ఆప్ జైసా కోయి సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. “పెళ్ళైన హీరోయిన్లు ఆన్ స్క్రీన్ రొమాన్స్ సరిగ్గా చేయలేరు. సినిమా షూటింగ్లో సహ నటీనటులపై ప్రేమాభిమానాలు ఉండాలి. అలా ఉన్నప్పుడే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. కానీ పెళ్ళైన హీరోయిన్లు హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసినప్పుడు సరిగ్గా కెమిస్ట్రీ వర్కౌట్ చేయలేరు.
ఏజ్ డిఫరెన్స్ సమస్యే కాదు – మాధవన్
అయితే మన సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో సంఘటనలను ఆధారంగా తీసుకునే సినిమాలు తెరకెక్కిస్తున్నారు.ఇక ఏజ్ డిఫరెన్స్ అనేది అసలు సమస్యనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా చాలా మంది జంటలు ఏజ్ ఎక్కువ ఉన్నవారిని పెళ్లిళ్లు చేసుకొని ఆనందంగా జీవిస్తున్నారు.. అయితే పెళ్ళైన వారు సినిమాల్లో రొమాన్స్ సరిగ్గా పండించలేరు అనే నా మాటలు వివాదానికి దారి తీస్తాయి కావచ్చు. కానీ ఇదే నిజం”. అంటూ మాధవన్ చెప్పుకొచ్చారు..
భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..
అయితే మాధవన్ మాట్లాడిన మాటలపై చాలామంది ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. పెళ్లయిన హీరోయిన్ల అభిమానులు.. పెళ్లయ్యాక కూడా చాలామంది హీరోయిన్లు రొమాంటిక్ సన్నివేశాలలో అద్భుతంగా నటిస్తూ ఉన్నారు. ఆ సన్నివేశాలు బహుశా ఈ హీరో చూడలేదు కావచ్చు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.
ఆప్ జైసా కోయి సినిమా విశేషాలు..
ఆప్ జైసా కోయి సినిమా విషయానికి వస్తే.. 30 ఏళ్ల హీరోయిన్ 40 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథాంశాన్ని ఇందులో చూపించారు. అయితే మాధవన్ గురించి గత రెండు రోజుల నుండి ఒక రూమర్ కూడా వినిపిస్తోంది. అదేంటంటే రాజమౌళి(Rajamouli) డైరెక్షన్లో మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ(SSMB 29 Movie)లో మహేష్ బాబు (Mahesh Babu)తండ్రి పాత్రలో మాధవన్ నటిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన అయితే లేదు.
ALSO READ:Samantha: సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ తెలుగు వాడే.. ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే?