Ram Charan సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోలకు అభిమానులు లేదా ఇతర దర్శక నిర్మాతలు కొన్ని ట్యాగ్స్ ఇస్తూ ఉంటారు. ఇలా వారి నటన ప్రతిభ ఆధారంగా అభిమానులు ట్యాగ్స్ తో వారి హీరోలను పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) కు కూడా మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్స్ ఉన్నాయి. చరణ్ నటించిన సినిమాలకు ఆయన పేరు ముందు ఈ ట్యాగ్స్ వాడుతూ ఉంటారు .RRR సినిమా ముందు వరకు మెగా పవర్ స్టార్ గా కొనసాగిన రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ ట్యాగ్ వాడుతూ వచ్చారు. అయితే సుకుమార్ తో తదుపరి చేయబోయే సినిమా విషయంలో మాత్రం ఈయన గ్లోబల్ స్టార్ (Global Star) అనే ట్యాగ్ తొలగించుకున్నారని తెలుస్తోంది.
సుకుమార్ సినిమా కోసం కేవలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా మాత్రమే తన పేరును వేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలా చరణ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తొలగించడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తొలగించడం మంచి నిర్ణయమని అభిమానులు ప్రశంసల కురిపిస్తున్నారు. గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు ఇలాగే తమని ట్యాగ్స్ తో పిలవద్దని అభిమానులకు వెల్లడించారు. ఈ జాబితాలో నయనతార(Nayanatara) కూడా ఉన్నారు.
నయనతార సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఈమెను అందరూ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తో పిలుస్తుండేవారు. అయితే తనని అలా పిలవద్దని నయనతార గతంలో వెల్లడించారు. వీరి మాదిరిగానే స్టార్స్ అందరూ కూడా రియాలిటీలోకి రావాలని ఒక హీరోని చూసుకొని మరొక హీరో వింత ట్యాగ్స్ క్రియేట్ చేసుకోవడం మానుకోవాలని తెలిపారు. ఈ విషయంలో అప్పుడు నయనతార ఇప్పుడు చరణ్ తీసుకున్న నిర్ణయం ఎంతో సరైనదని వీరిని చూసి మరి కొంతమంది స్టార్స్ కూడా మారాలని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ది పనులలో చరణ్..
ఇక రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు 60% షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఈ సినిమాని 2026 మార్చి 27వ తేదీ విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 8వ తేదీ హైదరాబాదులో ఏఆర్ రెహమాన్ నిర్వహించే లైవ్ కన్సర్ట్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఉండబోతుందని డైరెక్టర్ వెల్లడించారు. ఈ సినిమాలో చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ నటించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Kalki Movie: ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్… మరో గౌరవం అందుకున్న ప్రభాస్ సినిమా!