Sandeep Reddy Vanga : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సినిమా చేయటానికి ఎక్కువ రోజులు సమయాన్ని తీసుకుంటున్నారు దర్శకులు. దీనికి కారణం ముఖ్యంగా హీరోలకు సంబంధించిన డేట్లు అవైలబుల్ గా ఉండకపోవడమే. ఒకప్పుడు సీనియర్ హీరోలు అందరూ కూడా సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు విడుదల చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు సినిమాలు రెండు సంవత్సరాలకు ఒకటి మూడు సంవత్సరాలకొకటి వస్తున్నాయి.
ఆ వచ్చిన సినిమాలు నిరాశపరిస్తే అభిమానులు ఇంకా కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటారు. ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు చేయాలన్నా కూడా హీరో లుక్స్ విషయంలో డిఫరెన్సెస్ వస్తుంటాయి. ఇక ప్రస్తుతం దర్శకులు ఈ తరుణంలో ఒక కొత్త ప్లాన్ వేశారు. ప్రతి దర్శకుడు కూడా చాలామంది హీరోలతో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఒప్పుకొని ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు.
ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో కూడా విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసింది. అయితే మరోవైపు మహేష్ బాబు హీరోగా డెవిల్ అనే సినిమా చేయబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.
సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో చేయబోయే సినిమాకు ఒకటి అలానే మహేష్ బాబు సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేయడానికి ఇంకొక టీం ను కేటాయించినట్లు తెలుస్తుంది.
మరోవైపు సుజీత్ కూడా ఇదే ప్లాన్ ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం నాని పారడైజ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన కూడా దానికి సంబంధించి వచ్చేసింది. అయితే ఇప్పుడు సుజిత్ నానితో చేయబోయే సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.
ఒకవైపు ఈ పనుల్లో ఉంటూనే మరోవైపు పవన్ కళ్యాణ్ తో చేయబోయే ఓజీ సినిమా సీక్వెల్ రెడీ చేయడానికి మరో టీమును కేటాయించాడు సుజిత్. ఇలా దర్శకులు అంతా కూడా ఒకే ప్రాజెక్టు మీద ఉండిపోకుండా తదుపరి ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టడం వల్లనే వాళ్లకి కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Also Read : Biker: బైకర్ టీజర్ రిలీజ్, అదరగొట్టిన శర్వా సక్సెస్ ఖాయమేనా?