Biker Glimpse : ప్రముఖ హీరో శర్వానంద్ నుంచి ఒక సూపర్ హిట్ సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఒకే ఒక జీవితం సినిమా తర్వాత ఇప్పటివరకు ఆకట్టుకున్న సినిమా శర్వానంద్ చేయలేదు. అయితే కొంచెం టైం తీసుకుని అద్భుతమైన ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు శర్వానంద్.
శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి అనే సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే అప్పటికి ఎక్కువ సినిమాలు కాంపిటీషన్లో ఉన్నాయి కాబట్టి ఆ సినిమా వస్తుందా రాదా అని డౌట్ కూడా ఉంది. గతంలో భారీ సినిమాల మధ్య వచ్చిన శర్వానంద్ శతమానం భవతి సినిమా మంచి సక్సెస్ సాధించి కలెక్షన్స్ కూడా వసూలు చేసింది. ఇక శర్వానంద్ ప్రస్తుతం బైకర్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ విడుదలైంది.
ఇక్కడ ప్రతి బైకర్ కి ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కదా చావుకి ఎదురెళ్లి కథ అని వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ గ్లిమ్స్ వీడియోలో బైక్ రైడింగ్ ని చూపించారు. ఏం జరిగినా పట్టువదలని మోండివాళ్ళ కథ. గెలవడం గొప్పకాదు చివరిదాకా పోరాడటం గొప్ప అనే డైలాగ్ తో ఈ గ్లిమ్స్ ఎండ్ చేశారు. ఈ గ్లిమ్స్ వీడియో చూస్తుంటే సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని అభిప్రాయం కలుగుతుంది. ఈ సినిమాకి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు.
Also Read: The Girl Friend: ఒక పాట కోసం కోటి రూపాయలు ఖర్చు అయిపోయింది, ఇంతకు మించిన బూతు లేదు
ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే డిసెంబర్ నెలలో అఖండ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అఖండ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది ఒకరోజు తేడాలో శర్వానంద్ బైకర్ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.