Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. కోలివుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లోకేష్ ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇన్ని రోజులపాటు తెర వెనుక ఉంటూ సినిమాని ముందుకు నడిపించిన ఈయన ఈసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. లోకేష్ కనగరాజు హీరోగా సినిమా రాబోతోంది అంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ విడుదల చేశారు.
డైరెక్టర్ అరుణ్ మాథేశ్వర్(Arun Matheswar) దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో లోకేష్ కనగరాజ్ వామికా గబ్బి (Wamiqa Gabbi)హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా “డీసీ”(DC) పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఈ టీజర్ లోకేష్ లుక్ చూసిన అభిమానులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఈ టైటిల్ టీజర్ లో కేష్ కనగరాజ్ ఒళ్లంతా రక్తంతో చేతిలో కత్తి పట్టుకొని నోట్లో సిగరెట్ కాలుస్తూ నడుచుకుంటూ వామికా గబ్బి వద్దకు వెళ్తారు .అయితే ఆమె కండోమ్ తీసుకొని ఓ గదిలోకి వెళ్తుంది. అదే గదిలోకి లోకేష్ కనగరాజ్ కూడా వస్తాడు. ఇలా ఈ టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినిమా పట్ల భారీ స్థాయిలో ఆసక్తిని కలిగిస్తుంది.
ఇక ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ వీడియోలో అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి సెలవుల సందర్భంగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఇప్పటివరకు దర్శకుడిగా తెరవ వెనక ఉంటూ సినిమాని నడిపించిన లోకేష్ తెరపై నటుడిగా ఏ విధంగా సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
ఇక లోకేష్ ఇటీవల చివరిగా రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సుమారు 600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈయన తదుపరి సినిమాలపై కాకుండా ఈయన హీరోగా నటిస్తున్న సినిమా పై ఫోకస్ చేశారు అదేవిధంగా తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఖైతి 2 ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇలా లోకేష్ ఒక వైపు హీరోగా తన సినిమా పనులను చూస్తూనే మరోవైపు డైరెక్టర్ గా కార్తీ ఖైదీ 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
Also Read: Upasana -Ram Charan: పెద్ది పనులలో చరణ్ .. మిస్ అవుతున్న ఉపాసన..పోస్ట్ వైరల్!