Kalki Movie: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి(Kalki). ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు మరో గౌరవం లభించింది. సినిమా ఇండస్ట్రీలో కొనసాగే వారికి అందించే పురస్కారాలలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం(Dada Saheb Phalke Award) ఎంతో ప్రతిష్టాత్మకమైనది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ (DPIFF) 2025 వేడుకలు ముంబైలో ఎంతో ఘనంగా ముగి సాయి. ఇక ఈ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ లో భాగంగా కల్కి సినిమా కూడా మరో గౌరవాన్ని అందుకుంది.
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ నటుడిగా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ అవార్డును సొంతం చేసుకోగా, ఉత్తమ నటిగా కృతి సనన్ ఈ అవార్డును అందుకున్నారు.అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ పుష్ప ది రూల్ సినిమాకు గాను అవార్డును సొంతం చేసుకున్నారు. ఇకపోతే తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్(Film Of The Year) చిత్రంగా నిలిచింది. చిత్ర పరిశ్రమకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులలో కల్కి సినిమాకు ఇలాంటి గౌరవం లభించిన నేపథ్యంలో అభిమానులు చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కల్కి సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ప్రభాస్ , అమితాబ్ , బచ్చన్ , కమల్ హాసన్ దీపిక పదుకొనే వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్ వంటి వారు క్యామియో పాత్రలో నటించి మెప్పించారు. ఇక సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ సినిమా కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.
దీపికాను తప్పించిన మేకర్స్..
ఇక ఈ సీక్వెల్ సినిమా నుంచి బాలీవుడ్ నటి దీపిక పదుకొనే(Deepika Padukone)ను చిత్ర నిర్మాతలు తప్పించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చిత్ర బృందం ఎవరి పేర్లను అధికారికంగా వెల్లడించలేదు. ఇక ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఏకంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Janhvi Kapoor: అచ్చియమ్మాగా జాన్వీ కపూర్..ఆకట్టుకుంటున్న పెద్ది మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్!