Jagapathi Babu Tv Show: జగపతిబాబు(Jagapathi Babu) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో, కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడిపిన జగపతిబాబు ఇటీవల కాలంలో హీరోగా కాకుండా విలన్ పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హీరోగా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించని ఈయనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇలా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన జగపతిబాబు లెజెండ్ సినిమాలో విలన్(Villain) ద్వారా వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు.
బుల్లితెర హోస్టుగా జగ్గు భాయ్..
ఇక ఈ సినిమాలో విలన్ గా తన నటనతో అదరగొట్టిన జగపతిబాబు అప్పటినుంచి తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా విలన్ పాత్రలలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈయన బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. జీ తెలుగులో జగపతిబాబు “జయమ్ము నిశ్చయమ్మురా” (jayammu nischayammuraa) అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.
జ్ఞాపకం విలువ ఒక జీవితం…
ప్రోమో వీడియోలో భాగంగా జగపతిబాబు మాట్లాడుతూ..” జ్ఞాపకం విలువ ఒక జీవితం.. అని నేరుగా చెప్పలేకపోయినా అమ్మకి రాసిన ఉత్తరం, నాన్న కంట పడకుండా గడిపిన బాల్యం.. ఆటకోసమే బ్రతికిన రోజులు, అమ్మ నాన్న కోసమే చదువుకున్న క్షణాలు.. అలవాటుగా మారిన అల్లరి పనులు అన్నీ ఉన్న చిన్న చిన్న దొంగతనాలు…అలలా కదిలిపోయిన యవ్వనం.. కళ్ల ముందే మారిపోయిన కాలం.. వీటన్నింటికీ ఒకటే లక్ష్యం.. విజయం.. జయమ్ము నిశ్చయమ్మురా” అంటూ ఈ వీడియోలో తెలియచేశారు. ఇక ఈయన ఈ వీడియోలో చెబుతున్న సమయంలో వెనుక గోడ వైపు పలువురు సినిమా సెలబ్రిటీల ఫోటోలు ఉండటం మనం గమనించవచ్చు.
ఇలా ఈ వీడియో చూస్తుంటే మాత్రం జగపతిబాబు త్వరలోనే జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారని వారిని జగపతిబాబు ప్రశ్నించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం అతి త్వరలోనే ప్రసారం కానున్నట్లు తెలియజేశారు. ఇలా వెండి తెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న జగపతిబాబు త్వరలోనే బుల్లితెరపై కూడా తన మాటతీరుతో అందరిని సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక సినిమాల పరంగా జగపతిబాబు ఎంతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్లు జంతువులతో సమానం.. ఇలా అనేసాడేంటీ భయ్యా?