Ramya Krishnan: సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రమ్యకృష్ణ(Ramya Krishna) ఒకరు. ఒకానొక సమయంలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. రమ్యకృష్ణ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి తనలో ఉన్న మరో యాంగిల్ బయట పెట్టారు. అలాగే కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్(Special Songs) లో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా నటన విషయంలో విభిన్న కోణాలను బయటపెడుతూ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్నారు.
ఇకపోతే రమ్యకృష్ణ ఇప్పటికి తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఈమె తాజాగా జగపతిబాబు(Jagapathi Babu) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammuraa) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస ప్రోమోలను విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. నాకు నేను నటించిన ఐటమ్ సాంగ్స్ అన్ని మళ్లీ చేయాలని ఉంది అంటూ ఈమె తన మనసులో కోరికను బయట పెట్టారు.
ఇలా రమ్యకృష్ణ నాకు మళ్ళీ ఐటమ్ సాంగ్ చేయాలని ఉందని చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఈ వయసులో ఐటమ్ సాంగ్స్ చేయడం ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేయగా.. మరి కొందరు ఈ వయసులో ఇలాంటి కోరికలు కోరడం ఏంటి బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె బాహుబలి (Bahubali)సినిమాలోని శివగామి(Sivagami) పాత్ర గురించి కూడా మాట్లాడారు. బాహుబలి సినిమా సమయంలో నిర్మాత శోభు యార్లగడ్డ ఫోన్ చేసి నాకు 40 రోజులు కాల్ షీట్స్ కావాలని చెప్పేశారు. ఇలా 40 రోజులు అంటే కుదరదని నేను ఫోన్ కట్ చేశానంటూ తెలియచేశారు.
ఇక శివగామి పాత్రలో తాను నటిస్తున్న సమయంలో నిజంగానే రాజమాత అనే భావన నాలో కలిగిందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రమ్యకృష్ణ “ఇది నా మాట.. నా మాటే శాసనం” అంటూ బాహుబలి సినిమాలో డైలాగ్ చెప్పి అందరిని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జగపతిబాబు రమ్యకృష్ణ మధ్య ఎన్నో అంశాల గురించి ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక సౌందర్య ప్రస్తావన రావడంతో రమ్యకృష్ణ సౌందర్యను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక వీరిద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరసింహ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.
Also Read: Pooja Hegde: బన్నీ కోసం స్పెషల్ స్టెప్పులు వేయనున్న బుట్టబొమ్మ.. కళ్ళు చెదిరే రెమ్యునరేషన్!