Pooja Hegde: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి పూజా హెగ్డే (Pooja Hegde)ఒకరు. కెరియర్ మొదట్లో పలు ఫ్లాప్ సినిమాలను చవి చూసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం వరుస హిట్ సినిమాలను తన ఖాతలో వేసుకుంటూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. అయితే ఇటీవల పూజా హెగ్డే టైం అసలు బాలేదని చెప్పాలి. ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో కొంతకాలం పాటు అవకాశాలు లేకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి అవకాశాలను అందుకుంటున్న పూజా హెగ్డే వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదని చెప్పాలి.
ఇప్పటికే సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ నిరాశ మిగిలింది. అయితే తాజాగా ఈమెకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ప్రస్తుతం అట్లి(Atlee) డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా భాగమైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని ఈ పాటలో పూజా హెగ్డే నటించబోతోంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే పూజా హెగ్డే రజినీకాంత్ నటించిన కూలి సినిమాలో మోనిక అంటూ సాగిపోయే స్పెషల్ సాంగ్ లో చిందులు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేయబోయే సినిమాలో కూడా ఈమె స్పెషల్ పెర్ఫార్మెన్ ఇవ్వబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసిన సమంత, శ్రీ లీలా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పూజా హెగ్డే అవకాశాన్ని అందుకున్న తెలుస్తుంది.
రూ.5 కోట్ల రెమ్యూనరేషన్..
పూజ ఇదివరకు పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేశారు రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో కూడా జిగేలురాణి అని స్పెషల్ సాంగ్ లో నటించారు.. ఇప్పుడు మరోసారి బన్నీ సరసన స్పెషల్ స్టెప్పులు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ పాటలో కనిపించడం కోసం పూజ హెగ్డే భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఒక్క పాట కోసం పూజ హెగ్డే ఏకంగా ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఐదు నిమిషాల పాట కోసం ఐదు కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. మరి పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ఇప్పటికే దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, మృణాళ్ ఠాకూర్, రష్మిక వంటి పలువురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పూజ హెగ్డే కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.
Also Read: Ilayaraja: ప్రదీప్ రంగనాథన్ పై కేసు వేసిన ఇళయరాజా..డ్యూడ్ మూవీకి చిక్కులు