Tuni Girl Incidnet: కాకినాడ జిల్లా తుని నియోజక వర్గంలో మైనర్‌పై.. తాత వరుస అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తునికి చెందిన టీడీపీ దళిత నాయకుడు తాటిక నారాయణ రావు, జగన్నాధగిరి గురుకుల పాఠశాల నుంచి తాతనని చెప్పి విద్యార్దినీని తోటలోకి తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తోట యజమాని వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తోట యజమాని ప్రశ్నించడంతో బాలికను స్కూటర్‌పై తీసుకుని పరార్ అయ్యాడు నారాయణ రావు. బాలిక బంధువులు ఫిర్యాదుతో నారాయణరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. హోమ్ మినిస్టర్ అనిత తక్షిణమే స్పందించి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ నేతలు, మహిళా విభాగం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. విషయాన్ని అటు రాజకీయ కోణంలో తీసుకువెళ్లొద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు.
ఇక తాత అని చెబుతూ .. బాలికను తీసుకెళ్లిన నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు డీఎస్పీ. ఇప్పటికే నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. ఇదే సమయంలో ఇది ఏ పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదన్నారు డీఎస్సీ శ్రీహరి రాజు. అవాస్తవాలను ఎవరు ప్రచారం చేస్తున్న.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు డీఎస్పీ.
నారాయణరావు ఇంటి ఎదురు ఇంటిలోనే మైనర్ బాలిక నివాసం ఉండడం.. ఆమెపై పలుమార్లు నారాయణరావు బయటకు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లుగా ఆధారాలు లభించడంతో కఠినమైన చర్యలు తీసుకుంటాం అన్నారు డీఎస్పీ శ్రీహరి.
తల్లి నుండి అనుమతి లేకుండా నుండి బయటకు ఎందుకు పంపారో.. విద్యాశాఖ అధికారులు దానిపై ఎంక్వయిరీ చేస్తున్నారని తెలిపారు.
Also Read: తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేతకు ఆదేశాలు
నిందితుడని వైద్యా పరీక్షల అనంతరం రిమాండ్ కు తరలిస్తాం అన్నారు. ఈ కేసుని స్పీడ్ చార్జ్ షీట్ కేసుగా పరికిణించి ఆరు నెలల్లోనే చాట్ చెయ్ కంప్లీట్ చేసి ముద్దాయికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం తెలిపారు.