The Girl friend Trailer: నేషనల్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తాజాగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ నటుడు కం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ (Anu Emmanuel) కూడా మరో హీరోయిన్గా నటిస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా కొద్దిసేపటి క్రితం ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఫుల్ వైలెంట్ లవ్ నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రేమ అనే నరకంలో చిక్కుకున్న రష్మిక ఆ నరకం నుంచి బయటపడిందా ? అన్నట్టుగా ట్రైలర్లో చూపించారు. మొత్తానికైతే ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. అటు రాహుల్ రవీంద్రన్, ఇటు రావు రమేష్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక రష్మిక నటన పీక్స్ అని చెప్పడంలో సందేహం లేదు.
ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే రష్మిక , దీక్షిత్ శెట్టితో మాట్లాడుతూ” మనం చిన్న బ్రేక్ తీసుకుందామా? బ్రేక్ అంటే చిన్న కాదు.. ఒక బ్రేక్ లాగా” అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభించారు. కట్ చేస్తే ఎల్లుండే ముహూర్తం ఉందంట. మనం పెళ్లి చేసుకుందాము అంటూ దీక్షిత్ ఆమెను దగ్గరకు తీసుకొని కిస్ చేస్తారు. ఇకపోతే విక్రమ్ రష్మికాను ప్రేమిస్తుంటే అటు అను ఇమ్మానుయేల్ విక్రమ్ ఇష్టపడుతూ ఉంటుంది. ఇక విక్రం తరచూ రష్మికతో గడపడం చూసి అసలేముందు ఈ అమ్మాయిలో అంటూ అను ఇమ్మానియేల్ అనుకుంటుంది. ఇక తర్వాత రష్మిక దీక్షిత్ శెట్టిల లవ్ లైఫ్ చూపిస్తారు. అయితే ఆ లవ్ లైఫ్ అనేది ఆమెకు రాను రాను నరకంగా మారుతుంది. ఇక ఆ నరకం నుంచి బయటపడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మనకు ట్రైలర్లో చూపించారు. ఇందులో రావు రమేష్ రష్మికకు తండ్రిగా నటించారు. మొత్తానికైతే ఇదొక అద్భుతమైన రొమాంటిక్ వైలెంట్ లవ్ డ్రామాగా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇందులో రష్మిక తన ఎమోషనల్ తో అందరిని కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది అని చెప్పవచ్చు.
సాధారణంగా రాహుల్ రవీంద్రన్ సినిమాలు మంచి కథ ఓరియంటెడ్ తో వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ కూడా అలాగే ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ నిర్వహించగా ఇందులో కూడా ఎన్నో విషయాలను పంచుకుంది రష్మిక మొత్తానికైతే మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోబోతోంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ : Vivek Oberoi: సందీప్ కి పిచ్చి.. ఇలాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు – వివేక్ ఒబెరాయ్!