Film industry: సినిమా ఇండస్ట్రీలో చాలావరకు వారసత్వమే నడుస్తుంది.. ఇండస్ట్రీలోకి ఒక్కరు వెళ్లారంటే చాలు వారి వెనక వారి కుటుంబంలో నుండి ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అది డైరెక్టర్ అయినా సరే.. నిర్మాత అయినా సరే.. హీరో అయినా సరే అలా వారసత్వంగా వస్తూ ఉంటారు. అయితే తాజాగా టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే.. భర్తలు స్టార్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటే.. భార్యలు నిర్మాతలుగా పలు బ్యానర్లు స్థాపిస్తూ భర్తలకు సపోర్ట్ ఇస్తున్నారు.. ప్రస్తుతం వీరి గురించే ఇండస్ట్రీలో ఆసక్తకర చర్చ నడుస్తోంది. మరి భర్తల బాటలో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి నిర్మాతలుగా రాణిస్తున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం..
ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. అయితే అలాంటి ఈ సినీ రంగంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే దర్శకులు ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా సినిమాలతో తమ ప్రతిభ కరబరుస్తున్నారు. ఇక వీళ్ళ దారిలోనే వీళ్ళ భార్యలు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిర్మాతలుగా రాణిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే సుకుమార్ భార్య తబిత సుకుమార్, నాగ్ అశ్విన్ భార్య ప్రియాంక దత్, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య…
మహానటి సినిమాతో టాలీవుడ్లో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ (Nag Ashwin) భార్య ప్రియాంక దత్ (Priyanka Dutt)కూడా అందరికీ తెలుసు.. ప్రియాంక దత్ ఎవరో కాదు దిగ్గజ సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ కుమార్తనే.. అలా తండ్రి బాటలోనే ప్రియాంక దత్ కూడా నిర్మాణ రంగాన్ని ఎంచుకుంది.ఇప్పటికే ప్రియాంక దత్ ఎన్నో సినిమాలకు నిర్మాతగా చేసింది. నాగ్ అశ్విన్ భార్య ప్రియాంక దత్ తన తండ్రి “వైజయంతి మూవీస్ బ్యానర్లో”, అలాగే “స్వప్న మూవీస్” బ్యానర్ లో ఎన్నో సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ ని పెళ్లి చేసుకోక ముందు నుండే నిర్మాణ రంగంలో ప్రియాంక దత్ రాణిస్తోంది. కానీ ఇప్పుడున్న యంగ్ నిర్మాతలలో ప్రియాంక దత్ ఒకరు. మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం, సీతారామం, జాతిరత్నాలు వంటి హిట్ సినిమాలకు నిర్మాతగా చేసింది.
మాటల మాంత్రికుడిగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ (Trivikram Srinivas) సతీమణి సాయి సౌజన్య (Sai soujanya) కూడా “ఫార్చునర్ ఫోర్” సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి ఇప్పటికే హిట్ సినిమాలు నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. అయితే సాయి సౌజన్య ఫార్చునర్ ఫోర్ సినిమాస్ బ్యానర్లో ఒంటరిగా కాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ తో కలిసి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో మ్యాడ్, సార్ వంటి సినిమాలు వచ్చాయి.అలాగే రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర మూవీకి కూడా సాయి సౌజన్య సహనిర్మాతగా చేసింది. ఇక నిర్మాతగా పలు సినిమాలు చేస్తున్నప్పటికీ సాయి సౌజన్య మీడియాకి చాలా దూరంగా ఉంటుంది.
అలాగే మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, దేవర వంటి హిట్ సినిమాలకు డైరెక్షన్ చేసిన కొరటాల శివ భార్య అరవింద కూడా కొన్ని సినిమాలకు నిర్మాతగా చేస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
పుష్ప సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సుకుమార్ ప్రస్తుతం టాలీవుడ్లో రాజమౌళికి పోటీగా ఎదుగుతున్నారు.అయితే అలాంటి సుకుమార్ భార్య తబిత సుకుమార్ కూడా ఇండస్ట్రీ రంగంలో నిర్మాతగా రాణించడానికి రెడీ అయింది. తాజాగా తబిత సుకుమార్ ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది. “తబిత సుకుమార్ ఫిల్మ్స్” పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి అందులో ఒకప్పుడు యూత్ ని అట్రాక్ట్ చేసిన కుమారి 21ఎఫ్ సినిమాకి సీక్వెల్ గా కుమారి 22ఎఫ్ మూవీ నిర్మించబోతోంది. క్రియేటివ్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో రాణిస్తున్న తబిత సుకుమార్ అలా సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి నిర్మాతగా రాణించబోతోంది.ఇక గతంలో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాకి తబిత సుకుమార్ ప్రజెంటర్ గా పనిచేసిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు కుమారి 22 ఎఫ్ మూవీ తో పూర్తిస్థాయి నిర్మాతగా మారబోతోంది.
అలా స్టార్ దర్శకులుగా భర్తలు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటే.. వారి భార్యలు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతలుగా రాణిస్తున్నారు..
also read: The Girl friend Trailer: ప్రేమ అనే నరకంలో చిక్కుకున్న రష్మిక.. బయట పడుతుందా?