IND VS AUS, 3rd ODI: సిడ్నీ వేదికగా ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా (Australia vs India, 3rd ODI) మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. హర్షిత్ రాణా ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టడంతో 46.4 లోనే 236 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్, రెన్షా మినహా ఏ ఒక్క ఆస్ట్రేలియా ఆటగాడు రాణించలేదు. మిగిలిన ప్లేయర్లందరూ విఫలమయ్యారు. దీనికి తగ్గట్టుగానే టీమిండియా బౌలర్లు అందరూ కలిసికట్టుగా రాణించారు. దీంతో ఆస్ట్రేలియా మూడో వన్డేలో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. ఇక నిర్ణీత 50 ఓవర్స్ లో 237 పరుగులు చేస్తే టీం ఇండియా విజయం సాధిస్తుంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ వన్డేలో గౌతమ్ గంభీర్ ప్రియ శిష్యుడు హర్షిత్ రాణా రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. మొదటి రెండు వన్డేలో కూడా అద్భుతంగా రాణించిన హర్షిత్ రాణా మూడవ వన్డేలో కూడా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. 8.4 ఓవర్లు వేసిన హర్షిత్ రాణా 39 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ దెబ్బకు కంగారులు కకావికలం అయ్యారు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్ల వికెట్లని హర్షిత్ రాణా పడగొట్టాడు. అలెక్స్, కూపర్ అలాగే ఓవెన్ చివరలో వచ్చిన జోష్ హాజిల్‌వుడ్ వికెట్లను పడగొట్టాడు హర్షిత్ రాణా. ఈ తరుణంలోనే 23 ఏళ్ల హర్షిత్ రాణా ( HARSHIT RANA ) అరుదైన రికార్డు సృష్టించాడు. 8 వన్డేలలో ఆడిన హర్షిత్ రాణా, 16 వికెట్లు పడగొట్టాడు. 20.75 యావరేజ్ తో దుమ్ములేపాడు. 5.82 ఎకానమీ సాధించాడు.
మొదటి రెండు వన్డేలో పెద్దగా రాణించని టీమిండియా బౌలర్లు… మూడవ వన్డేలో మాత్రం దుమ్ము లేపారు. మొత్తం ఆరుగురు బౌలర్లను టీమిండియా కెప్టెన్ గిల్ వాడుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే బౌలర్లు కూడా వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీయగా హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టాడు. కొత్తగా వచ్చిన ప్రసిద్ధ కృష్ణ 7 ఓవర్లు వేసి, ఒక వికెట్ పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ మరో వికట్ తీశాడు. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టగా వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లతో రాణించాడు. ఓవరాల్ గా అందరూ బౌలర్లు కూడా వికెట్లు పడగొట్టగలిగారు. అయితే పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో.. సెకండ్ బ్యాటింగ్ చేసే టీమిండియా కాస్త జాగ్రత్తగా ఆడాలని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. ఇందులో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని సూచనలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే రెండు విజయాలు నమోదు చేసుకున్న ఆస్ట్రేలియా, టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
HARSHIT RANA IN ODIs:
– 8 Innings
– 16 wickets
– 20.75 average
– 5.82 Economy RateA very good start to the career for a 23-year-old youngster, credit to the Captain and coach backing him. 🔥 pic.twitter.com/D4yMaRmgUo
— Johns. (@CricCrazyJohns) October 25, 2025