Kalvakuntla kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరిగి ప్రజల్లోకి అడుగుపెట్టారు. జనం బాట యాత్రను ప్రారంభించారు. శనివారం ఉదయం తన నివాసంలో పూజలు చేసి.. అనంతరం గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..
తెలంగాణ ప్రజలంతా బాగుండాలన్న లక్ష్యంతో తెచ్చుకున్న అమరవీరులు, ఉద్యమకారులు ఆశయాలు నెరవేరలేదన్నారు. అందుకే ఆత్మగౌరవంతో కూడిన అందరి అభివృద్ధి కోసం.. సామాజిక తెలంగాణ సాధనకు జాగృతి పోరాడుతుందన్నారు.
ఉద్యమకారుల కోసం తాను కొట్లాడలేకపోయినందుకు కవిత బహిరంగంగా క్షమాపణ చెప్పారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 1200 మంది అమరుల ఆశయాలు నెరవేర్చడంలో వెనుకబడ్డామన్నారు. 580 మంది కుటుంబాలకు రూ.10లక్షలు, ఉద్యోగంతో సరిపెట్టిందన్నారు. కానీ ఇంకా అనేక కుటుంబాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నాయని వివరించారు. మన రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. వారి పిల్లలకు విద్య, ఉపాధి, గౌరవం అందించడంలో మనం వెనుకబడ్డాం.
ఇప్పటికీ ఉద్యమకారుల ఫోరంల పేరుతో ప్రతి మండలంలో ఇంకా ఆందోళన చేస్తున్నారని కవిత గుర్తు చేశారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాడలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
ఉద్యమ సమయంలో వెన్నెముకగా నిలిచినవారే, రాష్ట్రం వచ్చిన తర్వాత పక్కన పడిపోయారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కొంతమంది ఉద్యమకారులకే లభించాయి కానీ, సాధారణ ఉద్యమ సైనికులకు మాత్రం న్యాయం జరగలేదని తెలిపారు.
ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నా: కవిత
తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది అమరులు అయ్యారు
అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయాం
580 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాము
ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు, కొన్ని… pic.twitter.com/t0z9hHMmXl
— BIG TV Breaking News (@bigtvtelugu) October 25, 2025