E-Paper
Advertisement

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?
Advertisement

King 100 Vs King: సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతూ బాక్స్ ఆఫీస్ బరిలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఉంటాయి. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అవుతూ విజయాపజయాలను ఎదుర్కొన్నారు. ఇకపోతే త్వరలోనే విడుదల కాబోతున్న సినిమాల విషయంలో కూడా బాక్సాఫీస్ బరిలో నువ్వా నేనా అంటూ పోటీకి దిగబోతున్నాయని చెప్పాలి. ఒకానొక సమయంలో ఒక భాష నుంచి సినిమా విడుదల అవుతుంది అంటే కేవలం అదే భాషకు మాత్రమే పరిమితం అయ్యేది కానీ ప్రస్తుతం ఏ భాషలో సినిమా వచ్చినా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.

క్రిస్మస్ బరిలో స్టార్ హీరోలు..

ఇక ఈ ఏడాది చివరిలో స్టార్ హీరోల సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇటీవల టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna)తన సినీ కెరియర్లో మైలురాయిగా నిలిచిపోతున్నటువంటి తన వందవ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. కింగ్ 100 పేరిట ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 24వ తేదీ విడుదల కాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. అయితే అదే రోజున బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ (Shahrukh Khan)నటిస్తున్న “కింగ్” (King)సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద “కింగ్ 100” vs “కింగ్” అనే విధంగా పోటీ నెలకొందని చెప్పాలి.

బాక్స్ ఆఫీస్ బరిలో నాగ్..షారుక్..

Advertisement

ఇలా ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ బరిలోకి గెలుపు ఎవరిది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. మరి యధావిధిగా ఈ రెండు సినిమాలు అనుకున్న ప్రకారమే ఒకేరోజు విడుదల అవుతాయా లేదంటే ఎవరో ఒకరు వెనకడుగు వేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. నాగార్జున ఇప్పటివరకు హీరోగా 99 సినిమాలలో నటించారు. ఆర్ కార్తీక్ దర్శకత్వంలో 100వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ గ్లింప్స్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ లభించింది.

28 ఏళ్ల తర్వాత జంటగా..

ఇలా ఈ టైటిల్ గ్లింప్స్ కు వస్తున్న ఆదరణ చూస్తుంటే సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ నటి టబు(Tabu) కూడా కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో టబు నాగార్జున కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ ఇద్దరి జోడీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న కింగ్ 100 సినిమాకు పోటీగా షారుక్ ఖాన్ కింగ్ నేపథ్యంలో విజయం ఎవరి సొంతం అవుతుందంటూ అభిమానులు కూడా ఆత్రుత కనబరుస్తున్నారు.

Advertisement

Also Read: రెండో పెళ్లిపై ట్రోల్స్… ఒక్క ఫోటోతో కౌంటర్ ఇచ్చిన నటి శిరీష!

Related News

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

‘కింగ్ 100’లో ఐశ్వర్య రాజేష్..నిజమెంత?

సుప్రీంకోర్టులో లాయర్ గా పనిచేస్తున్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?

Big Stories

Advertisement
×