Irumudi Movie: మాస్ మహారాజా రవితేజ చాలా సంవత్సరాల తర్వాత ఇరుముడి సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకోవడంతో ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ శివా నిర్వాణ(Siva Nirvana) దర్శకత్వంలో రవితేజ (Raviteja),ప్రియా భవాని శంకర్ (Priyabhavani Shankar)హీరో హీరోయిన్లుగా నటించిన ఇరుముడి(Irumudi) సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 21వ తేదీ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటికే 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 200 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది.
రవితేజ సినీ కెరియర్ లోనే ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టిన సినిమాగా నిలిచిందని చెప్పాలి. ఇకపోతే ఇరుముడి సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వేదికలైన ‘బుక్ మై షో’, ‘డిస్ట్రిక్ట్’లలో గత 24 గంటల వ్యవధిలో అత్యధిక టికెట్లు అమ్ముడైన భారతీయ సినిమాగా ఇరుముడి మరొక రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు సోషల్ మీడియా వేదికగా తెలియచేశారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు పది రోజులు అవుతున్న ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.
ఈ సినిమాకు పోటీగా ప్రముఖ నటుడు యష్ నటించిన టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు అనుకున్న స్థాయిలోని టాక్ రాని నేపథ్యంలో ఇరుముడికి మరింత కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక టాక్సిక్ సినిమాకు కాస్త మిక్స్డ్ టాక్ రావడంతో ఇరుముడి థియేటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. ఈ ఆదివారం కూడా భారీ స్థాయిలోనే ఈ సినిమా వసూలను రాపడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఆదివారం ఏ స్థాయిలో కలెక్షన్ రాబడుతుందనేది తెలియాల్సి ఉంది . ఇక ఈ సినిమా స్పీడ్ చూస్తుంటే మాత్రం 200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో రవితేజ తదుపరి సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న రవితేజ మరి కొన్ని కథలను కూడా వింటూ బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించలేకపోయింది. ఇక తాజాగా ఇరుముడి అంటూ డివోషనల్ థ్రిల్లర్ ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!