E-Paper
Advertisement

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!
Advertisement

NBK 112 Movie: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయ్యి ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా కొనసాగుతున్న సమయంలో బాలకృష్ణ ప్రమాదానికి గురి కావడం, ఆయనకు సర్జరీ చేయడంతో బాలయ్య ఈ సినిమా షూటింగ్ కి చిన్న విరామం ప్రకటించారు. బాలకృష్ణతో సంబంధం లేనటువంటి సన్నివేశాలను పూర్తి చేసే పనిలో గోపీచంద్ ఉన్నారు.

బాలకృష్ణ కాలికి గాయం..

ఇకపోతే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి సినిమాని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)కాంబినేషన్లో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ పనులను కూడా పూర్తి చేశారు. ఇక బాలకృష్ణ ( Balakrishna)కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా పట్ల నందమూరి అభిమానులలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా బాలకృష్ణకు గాయం కావడంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆర్య..

Advertisement

ఇకపోతే ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో ఇతర భాష హీరోలు కీలక పాత్రలలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో కూడా మరొక తమిళ స్టార్ హీరో క్యామియో పాత్రలో కనిపించబోతున్నారు అంటూ ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి బాలయ్య సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న ఆ యంగ్ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు కోలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఆర్య(Arya). ఈ సినిమాలో ఆర్య ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం కొరటాల శివ ఆర్యను సంప్రదించి తన పాత్రను వివరించడంతో ఆర్య కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం..

ఇకపోతే ఆర్య ఇదివరకు పలు తెలుగు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో విలన్ పాత్రలో నటించారు అదేవిధంగా సైజ్ జీరో, సైంధవ్ వంటి చిత్రాలలో కూడా నటించారు అదేవిధంగా రాజారాణి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆర్య ఎంతో సుపరిచితమే. ఈ నేపథ్యంలో కొరటాల శివ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఈయనని సంప్రదించారని తెలుస్తుంది. ఇక కొరటాల శివ ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమా తర్వాత బాలయ్యతో ఈ సినిమా ప్రకటించడం పట్ల అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని ఎస్ఎల్ వి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా, అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Also Read: నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

Related News

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

Big Stories

Advertisement
×