Jayammu Nischayammuraa: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు జగపతిబాబు(Jagapathi Babu) తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలో విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జగ్గు భాయ్ తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా తన నటనతో ఆకట్టుకున్నారని చెప్పాలి. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి సినిమాలన్నీ కూడా విలన్ పాత్రలలోనే అవకాశాలు రావడంతో ప్రస్తుతం ఇతర భాష సినిమాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.
జయమ్ము నిశ్చయమ్మురా…
ఇప్పటివరకు కేవలం సినిమాలలో మాత్రమే నటించిన జగపతిబాబు ఇటీవల జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammuraa) అనే ఒక టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ పూర్తి కావడంతో ఎంతో మంచి ఆదరణ లభించింది. మొదటి ఎపిసోడ్ లో భాగంగా కింగ్ నాగార్జున ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జగపతిబాబు నాగార్జునను ఎన్నో విషయాల గురించి ప్రశ్నించారు. ఇలా ఇద్దరి మధ్య సినిమాల గురించి, వ్యక్తిగతం విషయాల గురించి, ఫ్యామిలీ గురించి కూడా చర్చలకు వచ్చాయి.
శ్రీ లీలను ఆటపట్టించిన జగపతిబాబు..
ఇక రెండవ ఎపిసోడ్లో భాగంగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) హాజరై సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో కాస్త వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా జగపతిబాబు శ్రీ లీలను ఆహ్వానించి.. మేమంతా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నటన నేర్చుకుంటే నువ్వు మాత్రం నటన నేర్చుకొని ఇండస్ట్రీ లోకి వచ్చావు అంటూ కామెంట్లు చేశారు. అదేవిధంగా నిన్ను ఏమని పిలవాలి అంటూ ప్రశ్నించడంతో మీ ఇష్టం మీకు ఎలా అనిపిస్తే అలా పిలవండి అంటూ శ్రీ లీల సమాధానం చెప్పడంతో చాలా లీలలు ఉన్నాయని చెప్పుకువచ్చారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ లీల అమ్మను కూడా ఆహ్వానించారు. ఆమెను చూడగానే జగపతిబాబు హీరోయిన్ గా మీరు రావాల్సింది పోయి మీ కూతురిని తీసుకువచ్చారు అంటూ కామెంట్లు చేయగా వెంటనే శ్రీ లీల తల్లి నేను మీకు పెద్ద అభిమానిని చెప్పారు. ఇక తదుపరి జగపతిబాబు శ్రీ లీల నీ గురించి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అంటూ చెప్పడంతో శ్రీ లీల షాక్ అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి శ్రీ లీల గురించి జగపతిబాబు చేసిన ఆ కంప్లైంట్స్ ఏంటి అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి . ఇక ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం జీ తెలుగు చానల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇక శ్రీ లీల కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ హిందీ భాషలలో సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Jr.NTR: వార్ 2 ఫ్లాప్ కు ఎన్టీఆర్ కారణమా? ఓర్నీ ఫ్యాన్స్ కోసం సినిమానే నాశనం చేశారుగా?