Motorola G45 5G vs Galaxy M17 5G vs Redmi 15 5G| భారతదేశంలో మూడు కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇటీవలే విడుదలయ్యాయి – శాంసంగ్ గెలాక్సీ M17 5G, రెడ్‌మి 15 5G, మోటోరోలా G45 5G. ఈ మూడు ఫోన్లు కూడా ఒకే రేంజ్ లో ఉన్నాయి. వీటిలో ఏది కొనాలో నిర్ణయించుకునేందుకు వీటి ఫీచర్లను పోల్చి చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ M17 5G: ప్రారంభ ధర రూ.12,499 (4GB+128GB). 6GB+128GB వేరియంట్ ధర రూ.13,999.
రెడ్ మి 15 5G: 6GB+128GBకు రూ.14,999, 8GB+256GBకు రూ.16,999.
మోటోరోలా G45 5G: 8GB+128GB ధర మాత్రం కేవలం రూ.11,999.
మోటోరోలా అత్యధిక RAM/స్టోరేజ్‌ను వేరియంట్ ని తక్కువ ధరలో అందిస్తుంది. అందుకే ధర విషయంలో మోటోరోలా బెటర్.
శాంసంగ్ M17 5G: 6.7 ఇంచ్ FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లే, అద్భుతమైన కలర్స్, కాంట్రాస్ట్‌ను అందిస్తుంది.
రెడ్ మి 15 5G: భారీ 6.9-ఇంచ్ FHD+ స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ స్మూత్ స్క్రోలింగ్.
మోటోరోలా G45 5G: 6.5-ఇంచ్ HD+, మిగతా రెండు ఫోన్ల కంటే తక్కువ రిజల్యూషన్.
శాంసంగ్ విజువల్స్ మిగతా రెండు కంటే బెటర్.. కానీ స్మూత్ స్క్రోలింగ్ మీకు ముఖ్యమైతే రెడ్ మి బెస్ట్.
శాంసంగ్ M17 5G: 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్.
రెడ్ మి 15 5G: ఈ గ్రూప్‌లో అతిపెద్ద 7,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో.
మోటోరోలా G45 5G: 5,000mAh బ్యాటరీ, కానీ 20W ఛార్జింగ్ మాత్రమే, ఇది కాస్త స్లోగా ఉంటుంది.
రెడ్ మి 15 5G బ్యాటరీ లైఫ్, వేగంగా చార్జింగ్ విషయంలో బెస్ట్ ఆప్షన్.
శాంసంగ్ M17 5G: ఎక్సినాస్ 1330 CPU, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ UI 7.
రెడ్ మి 15 5G: స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్OS 2.0.
మోటోరోలా G45 5G: అదే స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ప్యూర్ వెర్షన్.
రెడ్మీ, మోటోరోలా ప్రాసెసర్లు శాంసంగ్ కంటే పవర్‌ఫుల్.
శాంసంగ్ M17 5G: 50MP OIS మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్, 2MP మ్యాక్రో కెమెరా ఉంది.
రెడ్ మి 15 5G: సింగిల్ 50MP మెయిన్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా.
మోటోరోలా G45 5G: 50MP మెయిన్ కెమెరా, 2MP మ్యాక్రో, 16MP ఫ్రంట్ కెమెరా.
శాంసంగ్ OIS తో వెరైటీ కెమెరా సిస్టమ్ మంచిది.
సూపర్ AMOLED డిస్‌ప్లే, OIS కెమెరా వైవిధ్యం కోసం శాంసంగ్ M17 5G కొనుగోలు చేయండి
144Hz స్మూత్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, మంచి ప్రాసెసర్ కోసం రెడ్ మి 15 5G బెటర్.
మంచి పెర్ఫార్మెన్స్, క్లీన్ సాఫ్ట్‌వేర్ తక్కువ ధరలో ఉండడంతో మోటోరోలా G45 5G కొనండి.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే