K Ramp Collections : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది క మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా కే ర్యాంప్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా ఒకవైపు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమాతో కూడా కిరణ్ అబ్బవరం మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీకి దీపావళి సందర్భంగా కలెక్షన్లు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ సాధించినట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అసలు ఈ మూవీ మూడు రోజులకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
కిరణ్ అబ్బవరం 11వ సినిమాగా ఈ సినిమా విడుదలైంది.. ఇందులో హీరోయిన్ గా యుక్తి తరేజా నటించింది. జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ మూడు రోజుల్లోనే వసూళ్ల సునామీ సృష్టించింది.. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి 3 రోజుల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది.. ఈ సినిమా ఫస్ట్ డే రూ 4.5 కోట్ల గ్రాస్కలెక్షన్స్ తో గుడ్ స్టార్ట్ అందుకుంది. ఇక మొదటి రోజును మించి రెండవ రోజు మరింత ఎక్కువ రాబట్టి వరల్డ్ వైడ్ గా రూ. 11. 3 కోట్లు కొల్లగొటింది. నిన్న దీపావళి వీకెండ్ కావడంతో చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డు కూడా కనిపించడంతో ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా పెరిగాయి. మొత్తం మూడు రోజులకు గాను 14 కోట్ల వరకు కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తుంది. అతనికి ఈ మూవీ మూడు రోజులనే బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు..
Also Read :నీకు కాదు.. నాకు నచ్చినట్టు సినిమా చేయు… డైరెక్టర్‌ని ఫోర్స్ చేస్తున్న హీరో ?
కిరణ్ అబ్బవరం ఎప్పుడు డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. అలాగే ఇప్పుడొచ్చిన సినిమా స్టోరీ కూడా కాస్త కొత్తగానే ఉంది. ఈ మూవీలో కుమార్ అనే పాత్రలో హీరో నటించారు. కుమార్ పుట్టుకతోనే సంపన్నుడు. తండ్రి కృష్ణ అతి గారబంతో సర్వం సమకూర్చుతాడు. కానీ కుమార్ కి చదువు పట్టదు. పైగా ఎప్పుడూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. తనని దారిలో పెట్టాలని కేరళలోని ఓ కాలేజ్ లో జాయిన్ చేస్తారు. అప్పటికి అతను అక్కడ మారడు. అదే కాలేజీలో హీరోయిన్ కూడా చదువుతూ ఉంటుంది. అయితే హీరోయిన్ కి ఒక మానసిక సమస్య ఉంటుంది. ఆ సమస్య వల్ల తాను చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటుంది. ఆ సమస్య గురించి హీరోకి తెలిసిపోతుందా? ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? అనేది సినిమా స్టోరీ లో చూడాల్సిందే..