Mysaa Movie:రష్మిక మందన్న ..నేషనల్ క్రష్ గా యావత్ దేశంలోని యూత్ ని తనదైన అందంతో ఫిదా చేస్తున్న ఈ అమ్మడు ఇపుడు మరో సరికొత్త సినిమాతో ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయిపొయింది.ఇప్పటి వరకు రానా కెరీర్ లో ఎన్నడూ చేయని యాక్షన్ జానర్ లో ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాని రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్నారు.
అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్ లోకి వచ్చేందుకు రెడీ అయిపొయింది.ఇక ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నుండి ఒక క్రేజీ సాంగ్ వదిలింది మూవీ టీమ్.
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన క్లాసిక్ సినిమా ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో సూపర్ హిట్ అయిన ఓ రాములమ్మ పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు మేకర్స్.1997లో దాసరి నారాయణరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘ఒసేయ్ రాములమ్మ’ తెలుగు సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అన్యాయాన్ని ఎదిరించే రాములమ్మ పాత్రలో విజయశాంతి ఇచ్చిన ఫెర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయారు ఆడియన్స్ .ఇక ఇప్పటికీ ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి కూడా.
అలాంటి కల్ట్ సినిమాలోని సూపర్ హిట్ పాటని ఈ సినిమా కోసం రీమిక్స్ చేయడం తో సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు మూవీ లవర్స్.పైగా ఆ పాటని పాడిన వందేమాతరం శ్రీనివాస్ తోనే ఈ పాట పాడించడం విశేషం. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నజేక్స్ బిజోయ్ పేరు కూడా ఈ పాట తర్వాత టాలీవుడ్ లో మారుమ్రోగిపోతుందని చెప్పక్కర్లేదు.
ఇక రష్మిక విషయానికి వస్తే ఇప్పటికే పుష్ప సిరీస్, యానిమల్, ఛావా వంటి సినిమాలతో నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసిన ఈ కన్నడ కస్తూరి మైసా కోసం అప్పుడూ చేయని సాహసాలు చేస్తుందని మేకింగ్ వీడియో చూస్తేనే తెలుస్తుంది.ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో అలరించిన రష్మిక ఇలా సాహసాలు చేయడం చూస్తుంటే సినిమాపై ఈ భామ గట్టి ఆశలే పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.
ALSO READ:‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్ వెనుక అసలు కథ.. టీమ్ ఆన్సర్స్ వింటే నవ్వాల్సిందే!
ఇక సినిమా విషయానికి వస్తే రవీంద్ర పుల్లె దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఈశ్వరీ రావ్ , రాహుల్ రవీంద్రన్,సముద్రఖని,రావు రమేష్,శివ కందుకూరి,తారక్ పొన్నప్ప వంటి వారు కీలక పాత్రల్లో కనిపించడం విశేషం. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం బాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్ .చూడాలి మరి భారీ అంచనాలతో నవంబర్ 27న థియేటర్ లోకి రాబోతున్న ఈ సినిమా రష్మిక కి ఎలాంటి జ్ఞాపకాలని మిగిలిస్తుందో !