E-Paper
Advertisement

వామ్మో.. ప్రియాంక చోప్రా కూతురిలో ఇంత టాలెంట్ ఉందా?

వామ్మో.. ప్రియాంక చోప్రా కూతురిలో ఇంత టాలెంట్ ఉందా?
Advertisement

Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అద్భుతమైన నటనతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తొలిసారి రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ వారణాసిలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు ఇదే ఈమెకు తొలి తెలుగు చిత్రం కూడా కావడం గమనార్హం. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒకవైపు ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరొకవైపు తన కుటుంబానికి ఎప్పుడూ సమయం కేటాయిస్తుంటుంది ప్రియాంక చోప్రా.

ప్రియాంక చోప్రా కూతురిలో ఇంత టాలెంట్ ఉందా..

అందులో భాగంగానే మొన్నటికి మొన్న తన భర్త నిక్ జోనస్, కూతురు మాల్తీ మేరీతో కలిసి సరదా గడిపిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకుంది. పైగా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ఇకపోతే ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్టులో ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఈమె కూతురు మాల్తీ మేరీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. చిన్నారి చాలా ముద్దుగా గాయత్రీ మంత్రాన్ని తన తల్లి ఒడిలో కూర్చొని జపించింది.

నాలుగేళ్లకే స్పష్టంగా గాయత్రీ మంత్రం జపిస్తూ..

Advertisement

స్పష్టంగా మంత్రం పలుకుతున్న తీరుకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.ఈ వీడియో కాస్త బయటకు రావడంతో నాలుగు సంవత్సరాల మాల్తీ మేరీ ఇలా స్పష్టంగా గాయత్రీ మంత్రం జపించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నారి క్యూట్ నెస్ కి అభిమానులు ఫిదా అవుతూ ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. మొత్తానికైతే సినిమాలతోనే కాకుండా కుటుంబానికి సంబంధించిన అందమైన క్షణాలతో కూడా ప్రియాంక చోప్రా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తల్లిలాగే కూతురు కూడా మోస్ట్ టాలెంటెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

also read: అంతా నా కర్మ.. అతడిని ఉద్దేశించి నేను పోస్ట్ పెట్టలేదు: రేణూ దేశాయ్

ప్రియాంక చోప్రా కెరియర్..

Advertisement

ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. మాజీ ప్రపంచ సుందరి అయిన ఈమె తన నటన జీవితాన్ని ప్రారంభించక ముందు మోడల్గా కెరియర్ మొదలు పెట్టింది. 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ప్రియాంక చోప్రా.. 2002లో తమిళన్ అనే తమిళ చలనచిత్రం ద్వారా నటన జీవితాన్ని ప్రారంభించింది. అనిల్ శర్మ దర్శకత్వంలో ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై చిత్రం ద్వారా బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరంలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్ చిత్రం ద్వారా ఈమెకు మంచి విజయం లభించింది.

ప్రియాంక చోప్రా ప్రేమ, పెళ్లి, పిల్లలు..

కెరియర్ పీక్స్ లో ఉండగానే 2018లో అమెరికన్ గాయకుడు , నటుడు అయినా నిక్ జోనస్ తో డేటింగ్ మొదలుపెట్టిన ఈమె.. 2018 జూలై 19న తన పుట్టినరోజు సందర్భంగా గ్రీస్లో జోనస్ ఆమెకు ప్రపోజ్ చేశారు. ఇక అలా వీరిద్దరూ 2018 ఆగస్టులో ముంబైలో జరిగిన పంజాబీ రోక వేడుకలో నిశ్చితార్థం చేసుకొని అదే ఏడాది డిసెంబర్లో హిందూ క్రైస్తవ సంప్రదాయంలో జోద్పూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ లో వివాహం చేసుకున్నారు. 2022 జనవరిలో సరోగసి ద్వారా ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ప్రియాంక చోప్రా.

Related News

ఇదెక్కడి ఫ్యాషన్ గురూ.. పాత చీరలతో భూమి చేసిన ప్రయోగం వైరల్!

అంతా నా కర్మ.. అతడిని ఉద్దేశించి నేను పోస్ట్ పెట్టలేదు: రేణూ దేశాయ్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమంత.. ఎవరు పుట్టారంటే?

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

అల్లు అరవింద్ చేతుల్లోకి వైజయంతి మూవీస్.. అశ్వినీ దత్ క్లారిటీ!

నా డ్రీమ్ రోల్ అదే: రేణూ దేశాయ్

Sobhita Dhulipalla: అక్కినేని కోడలు రేంజే వేరు.. ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×