E-Paper
Advertisement

సుడిగాలి సుధీర్‌తో మళ్లీ సినిమా చేయను.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

సుడిగాలి సుధీర్‌తో మళ్లీ సినిమా చేయను.. నిర్మాత  షాకింగ్ కామెంట్స్!
Advertisement

GOAT Movie:‘గోట్’ ..సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ సినిమా ఎన్నో సార్లు వాయిదాల పాట పాడి ఎట్టకేలకి నవంబర్ 12 న థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమా చుట్టూ ఇప్పటికీ రకరకాల వివాదాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

సినిమాకి సుధీర్ సపోర్ట్ చేయలేదంటూ, సినిమాలో సుధీర్ అసలు సగ భాగం కనిపించనే కనిపించాలేదంటూ ఇలా రకరకాల వార్తలు నెట్టింట జోరుగా వినిపిస్తూనే ఉన్నాయి.ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

దాదాపు 60 నుంచి 70 శాతం వరకు హీరో లేకుండానే

‘గోట్’ సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సినిమాలో దాదాపు 60 నుంచి 70 శాతం వరకు హీరో లేకుండానే షూటింగ్ చేయాల్సి వచ్చిందని వాపోయారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కూడా హీరో లేకుండానే సీన్స్ కంప్లీట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అవసరమైన చోట సీజీ టెక్నాలజీ వాడామని, యంగర్ వెర్షన్ సీన్స్‌లోనూ సీజీ యూజ్ చేసినట్లు వివరించారు. ఏ ప్రొడ్యూసర్‌కు ఇలాంటి సిట్యుయేషన్ రాకూడదని, కానీ తమకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురైందని బాధపడ్డారు.

Advertisement

అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సినిమాను మధ్యలో ఆపేయాలని అనుకోలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. బ్లాక్‌మెయిలింగ్, ప్రెజర్స్ లేదా వేరే ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

ఇండస్ట్రీలో పనిచేసే ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఎవరైనా సరే తమ పని పట్ల నిజాయితీగా ఉంటే ధైర్యంగా ముందుకు వెళ్లాలని సజెస్ట్ చేశారు. మనం తప్పు చేయనప్పుడు ఎవరికీ తలొగ్గాల్సిన పని లేదని, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడని చెప్పుకొచ్చారు.

ఫైనాన్షియల్ కండిషన్ గురించి మాట్లాడుతూ

ఇక ‘గోట్’ సినిమా ఫైనాన్షియల్ కండిషన్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు సినిమాకు ఎక్కువమంది ఆడియన్స్ థియేటర్లకు వస్తేనే తమకు కొంత రిలీఫ్ దొరుకుతుందని చెప్పారు. పెద్ద సినిమాలు రిలీజ్ అయిన టైమ్‌లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కూడా కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్నిచోట్ల పెద్ద సినిమాలకు ఫ్రీ టికెట్లు పంచుతున్న పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి టైమ్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు జనాల్లోకి వెళ్లలేకపోవడం బాధగా ఉందన్నారు. ‘గోట్’ సినిమాను ఫ్యామిలీతో కలిసి, పిల్లలతో సహా చూడొచ్చని చెప్పారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బెట్టింగ్‌కు దూరంగా ఉండాలనే మెసేజ్ కూడా ఉందని వివరించారు.

సినిమా ఫస్ట్ హాఫ్‌లోని కామెడీ సీన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని, సెకండ్ హాఫ్‌లోనూ కాసేపు కామెడీ కంటిన్యూ అవుతుందని, చివరి 30 నిమిషాల్లో కథను చెప్పడానికి సీరియస్ మూడ్‌లోకి వెళ్తుందని తెలిపారు. ముగ్గురు, నలుగురు రైటర్లతో స్టోరీపై వర్క్ చేయించామని, కామన్ ఆడియన్‌లా మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ యాంగిల్‌లోనూ కథను చెక్ చేసిన తర్వాతే ముందుకు వెళ్లామని చెప్పారు.

మళ్లీ సినిమా చేసే ఛాన్స్ ఉందా

ఇక సుడిగాలి సుధీర్‌తో ఫ్యూచర్‌లో మళ్లీ సినిమా చేసే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నకి చంద్రశేఖర్ రెడ్డి రియాక్ట్ అవుతూ గతంలో ఎదురైన ఎక్స్‌పీరియన్స్‌లను గుర్తు చేసుకుంటే మళ్లీ కలిసి పనిచేయడం ఇద్దరికీ అంత కంఫర్టబుల్‌గా ఉండకపోవచ్చని తన మనసులోని మాటని బయటపెట్టారు.

ఇక ప్రస్తుతం తను మరో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యానని, ఇప్పటికే ఆ సినిమాను రిజిస్టర్ కూడా చేసినట్లు తెలిపారు.మొత్తంగా చూస్తె గోట్ సినిమా తో,హీరో సుధీర్ తో  ఈ నిర్మాతకి మర్చిపోలేని అనుభవాలు ఎదురైనట్టు ఆయన మాటలని వింటేనే అర్తమ అవుతుంది !

ALSO READ:ఇదెక్కడి ఫ్యాషన్ గురూ.. పాత చీరలతో భూమి చేసిన ప్రయోగం వైరల్!

Tags

Related News

వామ్మో.. ప్రియాంక చోప్రా కూతురిలో ఇంత టాలెంట్ ఉందా?

ఇదెక్కడి ఫ్యాషన్ గురూ.. పాత చీరలతో భూమి చేసిన ప్రయోగం వైరల్!

అంతా నా కర్మ.. అతడిని ఉద్దేశించి నేను పోస్ట్ పెట్టలేదు: రేణూ దేశాయ్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమంత.. ఎవరు పుట్టారంటే?

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

అల్లు అరవింద్ చేతుల్లోకి వైజయంతి మూవీస్.. అశ్వినీ దత్ క్లారిటీ!

నా డ్రీమ్ రోల్ అదే: రేణూ దేశాయ్

Big Stories

Advertisement
×