E-Paper
Advertisement

అంతా నా కర్మ.. అతడిని ఉద్దేశించి నేను పోస్ట్ పెట్టలేదు: రేణూ దేశాయ్

అంతా నా కర్మ.. అతడిని ఉద్దేశించి నేను పోస్ట్ పెట్టలేదు: రేణూ దేశాయ్
Advertisement

Renu Desai:రేణూ దేశాయ్ (Renu Desai).. మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘జేమ్స్ పాండు’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. అదే ఏడాది పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో, క్యూట్ స్మైల్ తో అభిమానుల హృదయాలను దోచుకున్న ఈమె.. మళ్లీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జానీ చిత్రంలో కూడా హీరోయిన్గా నటించి, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇక తర్వాత పెళ్లి, పిల్లలు, విడాకులు అంటూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

ఆ పోస్ట్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పెట్టలేదు – రేణూ దేశాయ్

అలా ఇండస్ట్రీకి దూరమైన రేణూ దేశాయ్ రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో హేమలత లవణం అనే పాత్రలో నటించి మళ్లీ ఇండస్ట్రీలో కనిపించని రేణూ దేశాయ్.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజినోవాకి విడాకులు ఇచ్చిన సమయంలో రేణూ దేశాయ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఇంకా దూషించడం నైతికంగా సరికాదు. ఇప్పటికే కింద పడిపోయిన వారిని తొక్కడం అమానుషం. ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు మనుషులే కదా.. మనం అద్దాల ఇంట్లో ఉంటూ ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరడం సరికాదు” అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఇది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి రేణూ దేశాయ్ ఈ పోస్ట్ పెట్టింది అంటే సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

అందరి కోసమే ఆ పోస్ట్ పెట్టాను – రేణూ దేశాయ్

Advertisement

ఇకపోతే తాజాగా ధనుష్ స్వీయ నిర్మాణంలో శ్రీ లీల, సాయి పల్లవి ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఓం. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రేణూ దేశాయ్ కు ఇదే విషయంపై ప్రశ్న ఎదురుగా ఆమె స్పందిస్తూ.. “నిజమే కదా.. నేను ఒక్కరి కోసం పెట్టలేదు. ఒక గుంపు కోసం పెట్టలేదు. అందరికోసం పెట్టాను. లేదంటే ఆ తర్వాత నా పైన సెటైర్లు వేయడం లాంటివి చేస్తారు. నేను సమాజం మంచి కోసమే ఆ పోస్ట్ పెట్టాను.” అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మళ్ళీ ప్రశ్నిస్తూ మీరు ఏ ఒక్కరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టలేదా అని అడగగా.. లేదు సాధారణంగా ఒకరికి ఉద్యోగం పోయి ఉంటుంది. లేదా ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు. బంధంలో బీటలు వచ్చి ఉంటాయి. ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న వారిని మళ్లీ మాటలతో పొడవడం ఎందుకు? అని ఆ పోస్ట్ పెట్టాను” అంటూ క్లారిటీ ఇచ్చింది రేణూ దేశాయ్.

ALSO READ: ‘ఓం’ మూవీ రివ్యూ.. ధనుష్, సాయి పల్లవి మెప్పించారా?

అంతా నా కర్మ – రేణూ దేశాయ్

Advertisement

అలాగే తన వనవాసం మాటలపై వచ్చిన కామెంట్లకి కూడా ఆమె స్పందిస్తూ.. ఆ వనవాసం ఇంటర్వ్యూ నేను ఆగస్టులో చేశాను. కానీ వాళ్లు డిలే చేసి చేసి అక్టోబర్లో రిలీజ్ చేశారు. ర్యాండం గా అది జరిగిపోయింది. ఆ వెంటనే ఇది వచ్చింది. అంతా నా కర్మ.. నేను ఎవరిని ఉద్దేశించి ఏ పోస్టు పెట్టలేదు . ఏ పాడు కాస్టు ఇంటర్వ్యూలో మాట్లాడలేదు ” అంటూ క్లారిటీ ఇచ్చింది మొత్తానికైతే అన్నాతో పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్న సమయంలో రేణూ దేశాయ్ పెట్టిన పోస్ట్ లపై వచ్చిన కథనాలకు ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది రేణూ దేశాయ్.

Related News

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమంత.. ఎవరు పుట్టారంటే?

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

అల్లు అరవింద్ చేతుల్లోకి వైజయంతి మూవీస్.. అశ్వినీ దత్ క్లారిటీ!

నా డ్రీమ్ రోల్ అదే: రేణూ దేశాయ్

Sobhita Dhulipalla: అక్కినేని కోడలు రేంజే వేరు.. ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

బురదలో ఫైట్.. నీళ్లలో 20 గంటలు.. రష్మిక కష్టాలు మామూలుగా లేవుగా!

అప్పుడు దేశముదురు.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి?

Big Stories

Advertisement
×